జాతీయ వార్తలు

మృత్యుంజయుడు హనుమంతప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సియాచిన్‌లో ఆరు రోజుల పాటు మంచుచరియల కింద చిక్కుకున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ అనే జవాను సురక్షితంగా బయటపడ్డాడు. సియాచిన్‌లో 19వేల అడుగుల ఎత్తులో మంచుచరియలు విరిగిపడడంతో పదిమంది సైనికులు గల్లంతయ్యారు. అందులో ఓ సైనికాధికారి ఉన్నారు. వారంతా మద్రాస్ రెజిమెంట్‌కు చెందినవారు. గల్లంతైన వారికోసం సైన్యం గాలింపుచర్యలు చేపట్టగా మంచుచరియల కింద 25 అడుగుల లోతులో చిక్కుకున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే హనుమంతప్పను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. హనుమంతప్ప కర్నాటకకు చెందినవాడు. ఒక జూనియర్ కమాండెంట్ అధికారితోపాటు వివిధ ర్యాంకులున్న తొమ్మిది మంది మంచుచరియల కింద గల్లంతయ్యారని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా వెల్లడించారు. గాలింపులో హనుమంతప్ప మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఐదు మృతదేహాలను వెలికితీసిన బృందాలు మరో నలుగురి కోసం గాలిస్తున్నాయ. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీ ఆసుపత్రికి వచ్చి హనుమంతప్పను పరామర్శించారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో లాన్స్ నాయక్‌కు వైద్య సేవలందిస్తున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. విధి నిర్వహంలో సైనికులు చూపుతున్న తెగువకు యావత్ జాతి గర్విస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప అసాధారణ సైనికుడని ప్రధాని ట్విట్టర్‌లో శ్లాఘించారు.

సియాచిన్‌లో మంచు చరియల్లో చిక్కుకున్నవారి కోసం అణ్వేషిస్తున్న సహాయక సిబ్బంది. తవ్వకాల్లో సజీవంగా బయటపడ్డ లాన్స్ నాయక్ హనుమంతప్ప