జాతీయ వార్తలు

‘అరుణాచల్’పై మరింత జాప్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధింపును ధ్రువీకరించే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పట్లో పట్టుదలగా ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉండడమే. సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకూ అరుణాచల్ జోలికిపోకూడదని ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాల్లో కూడా రాష్టప్రతి పాలన ధ్రువీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా రాష్టప్రతి పాలన విధింపు, ఆర్డినెన్స్ జారీ అంశాలు ఏ ప్రభుత్వం అయినా ప్రాధాన్యతపూర్వకంగా చేపడుతుంది. రాజ్యాంగంలోని 356వ ఆధికరణ ప్రకారం రాష్టప్రతి పాలన విధింపును ధ్రువీకరిస్తూ రెండు నెలల్లోగా పార్లమెంటు ఉభయ సభలు తీర్మానాలను ఆమోదించకపోతే అది రద్దయిపోతుంది. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జనవరి 26న అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన విధించారు. దీన్ని ధ్రువీకరిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానాలు చేపట్టాలన్నది తమ ఆలోచన అని, అయితే సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడే వరకూ వేచిచూడాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాష్టప్రతి పాలన విధింపును ధ్రువీకరిస్తూ పార్లమెంటులో ఎలాంటి తీర్మానాన్ని చేపట్టలేమని స్పష్టం చేశాయి. ఒకవేళ లోక్‌సభలో ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టినా రాజ్యసభలో మెజారిటీ లేనందున సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి.