జాతీయ వార్తలు

తలపాగా తీయనన్నందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సిక్కు మత విశ్వాసానికి గుర్తయిన తలపాగా (టర్బన్)ను తీయడానికి నిరాకరించిన అమెరికాకు చెందిన ప్రముఖ సిక్కు నటుడు, మోడల్, డిజైనర్ అయిన వారిస్ ఆహ్లూవాలియాను భద్రతా అధికారులు మెక్సికో సిటీనుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కనివ్వలేదు. నిన్న సాయత్రం అయిదున్నర గంటల సమయంలో తాను మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరో మెక్సికో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కౌంటర్ వద్దకు చెకింగ్ కోసం వెళ్లానని, అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు తనను పక్కన ఉండమని చెప్పారని ఆయన సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఆ తర్వాత వాళ్లు తనను ఆపాదమస్తకం చెక్ చేసారని, తర్వాత తన తలపాగా తియ్యమని చెప్పారని ఆయన తెలిపారు. అయితే ఇది తన మత విశ్వాసానికి చిహ్నమని, అందువల్ల తాను తీయనని చెప్పడంతో, అలా అయితే మీరు విమానం ఎక్కడానికి వీల్లేదని వారు తనను విమానం ఎక్కనివ్వలేదని తెలిపారు.
ఎయిర్‌లైన్స్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పే దాకా, అలాగే విమానాశ్రయం భద్రతా సిబ్బందికి సిక్కు అవగాహన శిక్షణ ఇచ్చేవరకు తాను న్యూయార్క్ వెళ్లనని కూడా ఆహ్లూవాలియా తెలిపారు. ఆస్కార్ కోసం నామినేట్ అయిన ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ సినిమాతో పాటుగా ‘ది క్యారీ డైరీస్’ అనే టీవీ సీరియల్‌లో సైతం ఆహ్లూవాలియా నటించారు.
కాగా, నిబంధనల ప్రకారం విమానం ఎక్కడానికి ముందు సెక్యూరిటీ చెక్ చేయించుకోవాలని మాత్రమే తాము కోరామని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, త్వరలోనే ఆహ్లూవాలియా తన గమ్యం చేరడానికి ఆహ్లూవాలియాకు తాము రెండు ప్రత్యామ్నాయాలను చూపించామని కూడా ఆ ప్రతినిధి చెప్పారు. కాగా, ఈ సంఘటనపై అమెరికా ఫ్యాషన్ డిజైనర్ల మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.