జాతీయ వార్తలు

పెరిగిపోతున్న పెండింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2కోట్లకు పైగా కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో పది శాతానికి పైగా కేసులు పదేళ్లు అంతకు పైగా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లెక్కలను బట్టి 2015 డిసెంబర్ 31 నాటికి వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల్లో 2 కోట్ల 60 వేల 998 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 83 వేలకు పైగా అంటే 41.38 శాతం కేసులు రెండేళ్లకన్నా తక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అదే సమయంలో 21,72,411 అంటే 10.83 శాతం కేసులు పదేళ్లు, అంతకు పైబడి పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయం అందించడం, న్యాయ సంస్కరణలపై జరగబోయే ఉన్నతస్థాయి సమావేశం కోసం న్యాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక నోట్ పేర్కొంది. ఈ సమావేశం వచ్చే వారం జరుగుతుంది. ఎన్‌జెడిజి వెబ్‌సైట్‌లో దేశంలోని అన్ని కోర్టుల వివరాలు ఉండవని, అందుకే న్యాయ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు దేశంలోని 24 హైకోర్టులు, సుప్రీంకోర్టునుంచి పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను సేకరిస్తుందని ఆ నోట్ పేర్కొంది. మొత్తం కేసుల్లో 18.1 శాతం అంటే 36,30,282 కేసులు అయిదునుంచి పదేళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, రెండేళ్లు, అయిదేళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 59,83,832 అంటే 29.83 శాతం అని ఆ నోట్ తెలిపింది.

అత్యవసరంగా దిగిన
కిరణ్ రిజిజు హెలికాప్టర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దించివేశారు. కిరణ్ రిజిజుతోపాటు తెహ్రీ-గార్వాల్ ఎంపీ మాలా రాజ్యలక్ష్మీ షా కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టు నుంచి ఎంఐ-175వి హెలికాప్టర్ బయలుదేరిన కొద్ది సేపటికే, ఇంజనులో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించిన పైలెట్ అత్యవసరంగా దించివేశాడు. హెలికాప్టర్‌లో వీరితోపాటు ఇద్దరు జర్నలిస్టులు, నలుగురు హోమ్ శాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత బిఎస్‌ఎఫ్‌కు చెందిన మరో హెలికాప్టర్‌లో వారు ఉత్తరాఖండ్‌కు పయనమయ్యారు.