క్రీడాభూమి

గాయాల సమస్య వేధిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 8: గాయాల సమస్య తమను తీవ్రంగా వేధిస్తున్నదని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ వాపోయాడు. తాజాగా బినురా ఫెర్నాండో గాయం కారణంగా మొదటి టి-20 మ్యాచ్‌కు దూరమయ్యాడని సోమవారం విలేఖరులోత మాట్లాడుతూ అన్నాడు. టి-20 ఫార్మెట్‌లో లంక రెగ్యులర్ కెప్టెన్ లసిత్ మలింగ,, టెస్టు జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఇప్పటికే గాయాల కారణంగా భారత్‌తో సిరీస్‌కు హాజరుకాలేదు. ఈవిషయాన్ని ప్రస్తావించిన అతను, తిలకరత్నే దిల్షాన్ వేలికి గాయమైందని, మదటి మ్యాచ్‌లో అతను కూడా ఆడకపోవచ్చని అన్నాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడం వల్ల కొన్ని సమస్యలు తప్పకపోవచ్చునని చెప్పాడు. అయితే, భారత్‌కు గట్టిపోటీనిస్తామని, సిరీస్‌ను గెల్చుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పాడు. ప్రపం కప్ టి-20 చాంపియన్‌షిప్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌కీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంద ని అన్నాడు. తిలకరత్నే దిల్షాన్ మొదటి మ్యాచ్‌లో ఆడలేకపోయనా, చివరి రెండు మ్యాచ్‌లకు అం దుబాటులో ఉంటాడని తెలిపాడు. జట్టులో నలుగురైదుగురు సీనియర్ ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్య ను ఎదుర్కోవడం పరోక్షంగా యువ క్రికెటర్లకు లాభిస్తుందని చండీమల్ వ్యాఖ్యానించారు. తుది జట్టులో స్థానం సంపాదించుకొని, సత్తా చాటే అవకాశం వారికి లభిస్తుందని తెలిపాడు. ఆసియా క ప్, ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమయ్యేందుకు భారత్ లాంటి పటిష్టమైన జట్టు తో జరిగే సిరీస్ ఉపయోగపడుతుందని అన్నాడు.

గురితప్పని పూర్వాషా
ఆర్చరీలో హ్యాట్రిక్ స్వర్ణాలు
షిల్లాంగ్: పూర్వాషా షెండే దక్షిణ ఆసియా గేమ్స్ ఆర్చరీలో స్వర్ణ పతకాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. జ్యోతి వెన్నామ్, లిల్లీ చాను పవోనమ్‌తో కలిసిన ఆమె మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్‌లో వీరు బంగ్లాదేశ్‌ను 228-217 పాయింట్ల తేడాతో ఓడించారు. ఇండివిజువల్, మిక్స్‌డ్ ఈవెంట్స్‌లోనూ ఆమెకు స్వర్ణాలు లభించాయి. పురుషుల టీం ఈవెంట్ ఫైనల్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మనాష్ జ్యోతి చాంగ్‌మయ్‌లతో కూడిన భారత జట్టు 230-219 తేడాతో భూటాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. మొత్తం మీద ఆర్చర్లు కేవలం కాంపౌండ్ ఈవెంట్‌లోనే ఐదు స్వర్ణాలు, రెండు రజత పతకాలను అందుకోవడం విశేషం.
స్క్వాష్‌లో జోత్న్సకు స్వర్ణం
గౌహతి: భారత స్క్వాష్ స్టార్ జోత్న్స చినప్ప మహిళల ఇండివిజువల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. పురుషుల విభాగంలో భారత్‌కు ఎదురైన పరాజయాల నుంచి అభిమానులకు ఆమె ఊరటనిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న జోత్న్స ఫైనల్‌లో పాకిస్తాన్‌కు చెందిన మరియా తూర్పాకీ వజీర్‌ను 10-12, 11-7, 11-9, 11-7 తేడాతో ఓడించి టైటిల్‌ను అందుకుంది. స్క్వాష్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోసల్, హరీందర్ పాల్ సింగ్ సంధు తమతమ విభాగాల్లో కాంస్య పతకాలను అందుకున్నారు.

హాకీ ఇండియా లీగ్
అగ్రస్థానానికి రాంచీ
భువనేశ్వర్, ఫిబ్రవరి 8: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్ మళ్లీ అగ్రస్థానికి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 3-2 తేడాతో కళింగ లాన్సర్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొమ్మిదో నిమిషంలోనే ధరమ్‌వీర్ సింగ్ ద్వారా కలింగకు గోల్ లభించింది. ఇది ఫీల్డ్ గోల్ కావడంతో ఒక బోనస్‌తో కలిసి కళింగకు రెండు గోల్స్ దక్కాయ. అయతే మరో నిమిషంలోనే ఆష్లే జాక్సన్ ఫీల్డ్ గోల్ సాధించాడు. దీనితో ఇరు జట్లు చెరి రెండు గోల్స్‌తో సమవుజ్జీగా నిలిచాయ. 22వ నిమిషంలో మహమ్మద్ అమీర్ ఖాన్ కీలక గోల్ చేసి, రాంచీని విజయపథంలో నడిపించాడు.