జాతీయ వార్తలు

మావోల అగ్రనేతలే టార్గెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్, నవంబర్ 20: నక్సల్స్‌పై ఇటీవల సాధించిన విజయాలతో చత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు ఇప్పుడు దేశంలోనే మావోయిస్టులకు అత్యంత పటిష్ఠ స్థావరమైన దక్షిణ బస్తర్‌లో మావోయిస్టు సీనియర్ నేతలను మట్టుపెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. గత 17 రోజుల్లో బస్తర్‌లోని సుకుమా, బీజపూర్ జిల్లాల్లో పది మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిలో అయిదుగురు మావో కమాండర్లున్నారు. ఈ నెల ప్రారంభంనుంచి రాష్ట్ర పోలీసులతో కలిసి పారా మిలటరీ బలగాలు ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సుకుమా, బీజపూర్ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలనుంచి మావోయిస్టులను తుడిచిపెట్టడంపై దృష్టిపెట్టిందని నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలలో పాలు పంచుకొంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు దక్షిణంగా దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుకుమా, బీజపూర్ జిల్లా అడవులు మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్టల్రలో తిరుగాడడానికి తోడ్పడడమే కాకుండా కాకులు దూరని కారడవులు కావడంతో గెరిల్లా యుద్ధంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అనువైన ప్రాంతమని ఆ అధికారి చెప్పారు. ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల సైద్ధాంతిక కేంద్రంగా అందరూ భావిస్తారు. అంతేకాదు, సుకుమా, బీజపూర్ జిల్లాలు దేశంలోనే అత్యధికంగా పారా మిలటరీ బలగాలున్న ప్రాంతాలు. కోబ్రా దళంతో పాటుగా ఒక్కో దానిలో వెయ్యిమంది దాకా ఉండే 11 సిఆర్‌పిఎఫ్ బలగాలను సుకుమా జిల్లాలో మోహరించగా, బీజపూర్ జిల్లాలో ఎనిమిది బెటాలియన్లు ఉన్నాయి. రాష్ట్ర పోలీసులతో పాటుగా దాదాపు 13 వేల మంది భద్రతా దళాలు ఈ రెండు జిల్లాల్లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి.
ఇటీవల జరిగిన ఆపరేషన్లు మావోయిస్టు కేడర్ మనోధైర్యాన్ని గణనీయంగా దెబ్బతీసాయని, చెల్లాచెదరయిన మావోయిస్టులు తిరిగి బలాన్ని కూడగట్టుకుని ఒక్క చోటికి చేరకుండా చూడాలన్నదే భద్రతా దళాల వ్యూహమని, అందుకే మామూలు కార్యకర్తలు కాకుండా సీనియర్ నేతలనే టార్గెట్ చేసుకోవాలన్నది తమ వ్యూహమని ఆయన చెప్పారు. మావోయిస్టు సీనియర్ నేతలు పాపారావు, గణేశ్ ఉయికేలతో పాటుగా ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న కమాండర్లు హిద్మా, నగేశ్, సోనులాంటి వారిపై ఇప్పుడు తాము దృష్టిపెట్టి ఉన్నట్లు ఆయన చెప్పారు.

మాలి రాజధాని బమాకా హోటల్ నుంచి విడుదలైన బందీలు పరుగులు పెడుతున్న దృశ్యం