జాతీయ వార్తలు

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశాన్ని అధిక వృద్ధి మార్గంలో నడిపించడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాగా, తమ ఉద్యోగులకు వేతన కమిషన్ సిఫార్సుల అమలుకోసం అధిక నిధులను ఖర్చు చేయాల్సిన అవసరమున్నందున కేంద్రం అదనపు కేటాయింపులు జరపాలని రాష్ట్రాలు ఆయనను కోరాయి. బడ్జెట్‌కు ముందు చర్చల్లో భాగంగా జైట్లీ శనివారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని, దేశాన్ని అధికవృద్ధి పథంలో పెట్టడానికి కలిసి పనిచేయాలని రాష్ట్రాలను కోరారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసిస్తూ రాబోయే నెలల్లో వృద్ధి వేగం మరింత పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు అధిక నిధులను కేటాయించినందున వౌలిక సదుపాయాలు, పేదరికం నిర్మూలన పథకాలపై వ్యయాన్ని పెంచాలని జైట్లీ రాష్ట్రాలను కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేసిన తర్వాత రాష్ట్రాల వనరులు గణనీయంగా పెరిగాయి. అందువల్ల రాష్ట్రాలు వౌలిక సదుపాయాల కల్పన, పేదరికం నిర్మూలన పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తాయని మేము ఆశిస్తున్నామని సమావేశం అనంతరం జైట్లీ విలేఖరులతో అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్టదశలో ఉందని, దీని ప్రభావం మన దేశంపైన, ముఖ్యంగా ఎగుమతులపై ఉన్నప్పటికీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన వ్యవస్థల్లో ఒకటిగా ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. కాగా, జైట్లీతో జరిగిన సమావేశంలో చాలా రాష్ట్రాలు పే కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి, అలాగే కేంద్ర నిధులతో అమలయ్యే పథకాల కింద రాబోయే కేంద్ర బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరపాలని కోరాయి. కేంద్రం ప్రతి రాష్ట్రానికి సహకారం అందిస్తుందని, ఎందుకంటే రాష్ట్రాల వృద్ధి పెరిగితే దేశ వృద్ధి కూడా పెరుగుతుందని జైట్లీ వారికి హామీ ఇచ్చారు. కాగా, గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సరిగా కురవనందున ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సమావేశంలో పలు రాష్ట్రాలు సూచించాయి.
chitram..
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.
చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్