జాతీయ వార్తలు

సిఎస్టీని త్వరగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర అమ్మకం పన్ను (సిఎస్‌టి)ను దశలవారీగా ఉపసంహరిస్తున్న కేంద్రం ఇందుకు సంబంధించి దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉంచిన నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని, నిధులను రానున్న సార్వత్రిక బడ్జెట్‌లో అందించాలని అనేక రాష్ట్రాలు కోరారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు శనివారం న్యూఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో జరిపిన సమావేశంలో ఈమేరకు డిమాండ్ చేశాయి. అలాగే ఏడవ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం వలన ఉత్పన్నమయ్యే అదనపు భారాన్ని అధిగమించేందుకు వీలుగా రాష్ట్రాలకు ప్రత్యేక సాయం అందజేయడంతో పాటు 14వ ఆర్థిక కమిషన్ సిఫారసులకు అనుగుణంగా తమ రుణ పరిమితిని పెంచుకునేందుకు అనుమతించాలని కూడా అవి కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ‘2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించి రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని జైట్లీతో జరిపిన సమావేశంలో ఒడిశా ఆర్థిక మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ స్పష్టం చేశారు. ఆయనతో గొంతు కలుపుతూ తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు కూడా ఇదేవిధమైన విజ్ఞప్తి చేశాయి. 2012-13 సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు మిగిలిన సిఎస్‌టి నష్టపరిహార బకాయిలను చెల్లించేందుకు కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నామని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎస్ పర్మీందర్ సింగ్ ధిండ్సా తెలిపారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు దిశగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఏడాదికి 1 శాతం చొప్పున సిఎస్‌టిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిఎస్‌టిని అమలులోకి తీసుకువచ్చే వరకు రాష్ట్రాలకు సిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించాలని నిశ్చయించుకున్న కేంద్ర ప్రభుత్వం 2008 జూన్ నుంచి దశలవారీగా సిఎస్‌టిని 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం 2011-12 నుంచి నష్టపరిహారాన్ని అందజేయకపోవడంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.
ఇదిలావుంటే, రాష్ట్రాల రుణ పరిమితి పెంచుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్లు అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రాలు తమ రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి (రాష్ట్ర జిడిపిలో) పెంచుకునేందుకు అనుమతించాలని 14వ ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. రుణ పరిమితిని పెంచుకోవడం వలన 2016 ఆర్థిక సంవత్సరంలో తాము అదనంగా రూ.3000 కోట్ల నిధులు సమీకరించుకునేందుకు వీలవుతుందని మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జయంత్ మలాయియా స్పష్టం చేయగా, ఈ విషయమై చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఒడిశా ఆర్థిక మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.