జాతీయ వార్తలు

ఈ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రకు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ వెల్లడించారు. విభజన మూలంగా రాష్ట్రం ఆర్ధికంగా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశనికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పీవీ రమేశ్ హజరై రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన కారణంగా ఆంధ్రకు 16,079 కోట్ల ఆర్ధిక లోటు ఏర్పాడిందని, అలాగే కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏపీకి రూ.2,303 కోట్లు విడుదల అయ్యాయన్న పీవీ రమేష్, ఇంకా కేంద్రం నుంచి రూ.13,779 కోట్లు నిధులు రావాల్సి ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి ఏపీకి అందాల్సిన ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయని, వాటిని కేంద్రం ముందుంచామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రతి జిల్లాకు రూ.200 కోట్లు చొప్పున ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆర్ధిక మంత్రిని కోరామన్నారు. విభజన తర్వాత ఆంధ్రకు కొంతమేర పారిశ్రామిక రాయితీలు కేంద్రం ఇచ్చిందని, వాటి మూలంగా తక్కువ ప్రయోజనాలు వచ్చాయని, అలాకాకుండా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తరహాలో రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. ఆంధ్ర కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి నాలుగు వేల కోట్లు కేటాయించడంతో పాటు, నిధుల సమీకరణ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఆంధ్రకు ఇస్తామన్న సాయంపై బడ్జెట్‌లో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలోకంటె సుమారుగా రూ.4000 కోట్లు కేటాయించడంతో పాటుగా కేంద్ర పథకాల అమలుకు మరింత సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.