జాతీయ వార్తలు

బాంబు బెదిరింపు.. విమానాలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలకు బుధవారం స్వల్ప వ్యవధిలో నాలుగు బాంబు బెదిరింపు ఫోన్‌లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం మూడు విమానాలను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి ఖాట్మండు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలు దేరడానికి కొద్ది వ్యవధి ముందే నిలిపివేశారు. బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన ఎయిర్‌ఆసియా విమానం కూడా బాంబు బెదిరింపుల కారణంగా నిలిచిపోయింది.