జాతీయ వార్తలు

26/11 కేసు దర్యాప్తుకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 27: ముంబయిపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 26/11 దాడికి పథకం రూపొందించటంతోపాటు దానిని అమలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల స్వర నమూనాలను సేకరించడానికి అనుమతించాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. 26/11 దాడి సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ, మరో ఆరుగురు నిందితుల స్వర నమూనాలను పొందడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దీంతో విఫలమయింది. దాడి జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులతో సూత్రధారులు మాట్లాడుతుండగా భారత నిఘా సంస్థలు రికార్డు చేశాయని, ఆ సంభాషణలతో పోల్చి చూసి, తరువాత ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఎటిసి) ముందు సాక్ష్యంగా ప్రవేశపెట్టడానికి ఈ ఏడుగురు నిందితుల స్వర నమూనాలు కావాలని ప్రాసిక్యూషన్ గతంలో ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు కొట్టివేసింది. స్వర నమూనాలు పొందడానికి అనుమతించే చట్టం ఏదీ లేదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు కూడా 2011, 2015లో లఖ్వీ స్వర నమూనాలు సేకరించడానికి అనుమతించలేదు. భారత నిఘా సంస్థలు రికార్డు చేసిన సంభాషణల్లో నిందితులు ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఉందని పేర్కొంటూ ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయడానికి నిందితుల స్వర నమూనాలు తప్పనిసరి అని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు వాదించారు. అజ్మల్ కసబ్, ఫహీమ్ అన్సారీలను పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించాలని కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టివేసింది.
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గత సంవత్సరం డిసెంబర్‌లో ఇస్లామాబాద్‌ను సందర్శించిన సందర్భంగా 26/11 దాడి కేసు విచారణను త్వరగా పూర్తి చేస్తామని పాకిస్తాన్ ఆమెకు హామీ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయి అడియాలా జైలులో కొంత కాలం విచారణ ఖైదీగా ఉన్న లఖ్వీ 2014 డిసెంబర్‌లో బెయిలు పొంది, తరువాత బయటకు వచ్చిన విషయం తెలిసిందే.