జాతీయ వార్తలు

ప్రకృతితో మమేకం అదే భారతీయ జీవన విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయులది ప్రకృతితో మమేకమైన సమాజం, ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి సమాజం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంక్రాం తి సందర్భంగా తమ నివాసంలో ఏర్పాటు చేసిన సంబరాలకు హాజరైన మోదీ తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులు తన జీవితాలను క్యాలెండర్‌తో ముడిపెట్టుకోకుండా ప్రకృతితో పెనవేసుకున్నారని మోదీ తెలిపారు. సూర్య చంద్రుల గమనం ఆధారంగా మన జీవితాలు ముందుకు సాగుతాయన్నారు. గతంలో మన సెలవులు ఆదివారం కాకుండా పౌర్ణిమ, ఆమావాస్య రోజు ఉండటం గమనార్హమని చెప్పారు. పండుగలు మన ఆర్థిక విధానం, విజానంతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతితో ఎలా మమేకం కావాలని ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయని మోదీ తెలిపారు. భారతీయులు ఈ విధానాన్ని వేల సంవత్సరాల నుండి అమలు చేస్తున్నారనీ, మకర సంక్రాంతి కూడా ఇలాంటిదేనని ప్రధాని చెప్పారు. రైతులు సాగును మొదలు పెట్టేటప్పుడు లేదా పంట ఇంటికి వచ్చినప్పుడు దేశంలో పండుగలు చేసుకుంటామన్నారు. ప్రకృతిని కాపాడుకోవటం ఇప్పుడు ప్రపంచానికి ఒక సవాలుగా మారిందంటూ కాప్ 21 సదస్సులో ప్రపంచాన్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు తీర్మానాలు జరగటం గమనార్హమని మోదీ సూచించారు. ప్రకృతితో సహజీవనం చేయటం ప్రజల జీవన శైలిగా మార్చుకోవాలన్న సందేశాన్ని ఆ సద స్సు ఇచ్చిందని మోదీ తెలిపారు. మక ర సంక్రాంతి తరువాత సూర్యుడి వెలుగు అధికంగా ఉంటుందంటూ ప్రజల జీవితాలు కూడా వెలుగులమ యం కావాలని మోదీ ఆకాంక్షించారు.
ఎస్పీకి సన్మానం
ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రధాని మోదీ శాలువా కప్పి సన్మానించారు. గీతాలాపనలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్పీ ప్రశంసనీయుడని అభినందించారు. స్వచ్ఛ భారత్‌ను ప్రచారం చేసేందుకు ఎస్పీ రూపొందించిన గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. యాభై సంవత్సరాల పాటు సంగీత సాధన చేయటం సులభం కాదు, మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ కాలం ప్రజాభిమానాన్ని చూరగొనటం మామూ లు విషయం కాదని మోదీ చెప్పారు. స్వచ్చ గీతాన్ని దేశంలోని అన్ని భాషల్లోకి అనువదించాలని ఎస్పీ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ కొనియాడారు. బాలసుబ్రమణ్యం సంగీత పాండిత్యాన్ని వెంకయ్యనాయుడు కొనియాడారు. కళను ప్రోత్సహించటం , ప్రతిభకు పట్టం కట్టడం మంచి సంప్రదాయమనీ, అందుకే ఎస్పీకి ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేశామని ఆయన చెప్పారు. కాగా తన జీవితంలో ఇది మరుపురాని రోజని ఎస్పీ చెప్పారు. ప్రపంచ నేతగా ఎదిగిన మోదీ పక్కన కూర్చోవటం తనకు మధురానుభూతి అనీ, ఆయన చేతుల మీదుగా సన్మానం పొందటం దేవుడిచ్చిన అవకాశమని ఎస్పీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను పాడిన నలభై వేలకు పైగా పాటల్లో స్వచ్చ భారత్ ప్రచార గీతమే గొప్పదన్నారు. వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.
chitram...
ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించి చిత్రపటాన్ని
బహూకరిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు