జాతీయ వార్తలు

కోరుకున్న విదేశీ ప్రొఫెసర్‌తో విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 14: జాతీయ స్థాయిలో జ్ఞాన్ పేరిట చేపట్టిన జాతీయ నెట్‌వర్క్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు కేంద్ర జనశక్తి వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన విద్యావేత్తలు భారత విద్యాసంస్థల్లో పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఈ సమున్నత కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో దేశంలోని ప్రతి విద్యా సంస్థను అంతర్జాతీయంగా ఉన్నతమైన విద్యా సంస్థలను భాగస్వామ్యం చేశామని వెల్లడించారు. దీనివల్ల దేశంలోని ఏ సంస్థ అయినా కూడా తాము కోరుకున్న విదేశీ విద్యావేత్తను రప్పించుకునే అవకాశం ఉంటుందని స్మృతి ఇరానీ వెల్లడించారు. భారత శాస్త్ర విద్యా పరిశోధనా కేంద్రాన్ని కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటు దేశీయ, అటు అంతర్జాతీయ విద్యావేత్తల కలయికతో విద్యా ప్రమాణాలను పరిపుష్టం చేయడం సాధ్యమవుతుందని వెల్లడించారు. విదేశీ విద్యా సంస్థలకు చెందిన నిపుణులు ఏడు రోజులపాటు దేశంలోని ఏ విద్యా సంస్థలోనైనా బోధనలు చేసే అవకాశం ఉంటుందని, ఇందుకు వారు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదని స్మృతి ఇరానీ తెలిపారు.

తిరువనంతపురంలో గురువారం ‘జ్ఞాన్’ కార్య క్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ