జాతీయ వార్తలు

మకర సంక్రాంతి సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జనవరి 14: హిందువులకు ఎంతో పవిత్రమైన మకరసంక్రాంతి సందర్భంగా గురువారం అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో వేలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నెల రోజుల పాటు జరిగే మాఘమేళా మకరసంక్రాంతినుంచే ప్రారంభమవుతుంది. గట్టి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భక్తులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మైళ్ల దూరం నడిచి తెల్లవారుజామునుంచే త్రివేణి సంగమానికి చేరుకున్నారు. పవిత్ర స్నానాలు అచరించిన తర్వాత ఆలయాల్లో పూజలు జరిపిన భక్తులు మకర సంక్రాంతి ప్రత్యేక వంటకాలయిన పప్పులతో చేసిన కిచిడి (పులగం), నువ్వులు, బెల్లంతో చేసిన తీపి వంటకాన్ని వండుకొని భుజించారు. నెలరోజుల టు ‘కల్పవాస్’ చేసే వేలాది భక్తులకోసం త్రివేణీ సంగమం ఒడ్డున వేసిన టెంట్లతో ఆ ప్రాంతమంతా కూడా ఓ తాత్కాలిక పట్టణాన్ని తలపించింది. ముఖ్యంగా మకర సంక్రాంతి, వౌని అమావాస్య, బసంతి పంచమి రోజుల్లో భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసారు.

మకర సంక్రాంతి సందర్భంగా గురువారం హరిద్వార్‌లోని గంగానదిలో
పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు