జాతీయ వార్తలు

కాలేయ వ్యాధుల చికిత్సకు మరిన్ని సంస్థలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో కాలేయ వ్యాధులు పెరిగిపోతుండడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేయడమే కాక, ఈ వ్యాథుల పట్ల ప్రజల్లో అవగాహన లేక పోవడం, అలాగే ఈ వ్యాధులను నయం చేసేందుకు తగిన చికిత్సలు లేక పోవడం కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు. గురువారం ఇక్కడి కాలేయ, పిత్త సంబంధిత శాస్త్రాల అధ్యయన సంస్థ ఐఎల్‌బిఎస్)లోఈ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులనుద్దేశించి రాష్టప్రతి మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా కాలేయానికి సంబంధించి అత్యుత్తమ వైద్య చికిత్సలను, ఆపరేషన్ విధానాలను రూపొందించాలని నిపుణులను కోరారు. మానవ శరీరంలో కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటని, ఒక విధంగా చెప్పాలంటే మన జీవక్రియ ఫ్యాక్టరీకి అది మాస్టర్ రెగ్యులేటర్ లాంటిదని ఆయన అన్నారు. అందువల్ల గుండె జబ్బులలాగానే ఇప్పుడు కాలేయ వ్యాధులు కూడా సర్వసాధారణమై పోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి జనంలో చైతన్యం, ఈ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, పరిశోధనా సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేక పోవడం విచారకరమని ఐఎల్‌బిఎస్ ఆరవ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ ప్రణబ్ అన్నారు. ఈ స్వయంప్రతిపత్తి సంస్థ మూడవ స్నాతకోత్సవం కూడా ఈ రోజే కావడంతో సంస్థలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసారు. కాలేయ వ్యాధుల కారణంగా చనిపోయే వారి సంఖ్య , దేశంలో కాలేయ మార్పిడి అవసరాలు పెరుగుతూ ఉండడం దేశ జనాభాలో కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయనడానికి నిదర్శనాలని అన్నారు. గత ఏడాది 87 వేల మందికి రోగులకు చికిత్స చేయడమే కాకుండా, సంస్థ ఏర్పాటయినప్పటినుంచి 283 కాలేయ మార్పిడులు జరిపిన ఐఎల్‌బిఎస్‌ను రాష్టప్రతి అభినందించారు.