జాతీయ వార్తలు

వైద్యరంగం.. సవాళ్లమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 7: దేశంలో వైద్యం రంగం ఇప్పటికీ అంటు వ్యాధులు, ఇతర వ్యాధులు, జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులను అదుపు చేయడమనే సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా చెప్పారు. ‘ఆరోగ్య రంగంలో మనం కచ్చితమైన పురోగతి సాధించాం. అయితే ఇప్పటికీ చేయాల్సినవి చాలా ఉన్నాయి’ అని గురువారం ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్, సోషల్ మెడిసిన్స్ 43వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అన్నారు. ఇంత భారీ జనాభా, వైద్యం రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడం, దేశంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం వీటన్నిటి దృష్ట్యా చూసినట్లయితే మనం ఆరోగ్య రంగంలో కచ్చితంగా పురోగతి సాధించాం’ అని ఆయన అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మనం చక్కటి ఫలితాలు సాధించాం. ముఖ్యంగా అంటువ్యాధుల సవాలును అధిగమించాం. అయితే అంటువ్యాధులను పూర్తిగా అదుపు చేయడం అనే అసంపూర్తి లక్ష్యం, ఇతర వ్యాధులు, జీవన శైలి వ్యాధులు అనే మూడు సవాళ్లను మనం ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం అని ఆయన అన్నారు. చికిత్సకన్నా కూడా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, ఈ దిశగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారత దేశాన్ని ఆరోగ్యవంతంగా చేయడమేని చెప్పారు. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల అంశం గురించి మాట్లాడుతూ, బడ్జెట్ సమస్య కాదని, అయితే చాలా రాష్ట్రాలు తము కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకునే స్థితిలో లేవని నడ్డా చెప్పారు.
అంటువ్యాధులను అదుపు చేయడంలో భారత దేశం చక్కటి పురోగతి సాధించినప్పటికీ అందరికీ వైద్య సేవలు అనే లక్ష్యాన్ని సాధించాలంటే చేయాల్సింది ఎంతో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత దేశ ప్రతినిధి హ్యాంక్ బేక్‌డమ్ అన్నారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడిపెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడమేననే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ తన ప్రసంగంలో ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. గుజరాత్ సంస్థాగత ప్రసవాల విషయంలో దాదాపు నూరు శాతం లక్ష్యాన్ని సాధించిందని, ఫలితంగా శిశు మరణాల రేటు, ప్రసవ సమయంలో తల్లీ బిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు.