జాతీయ వార్తలు

పోలీసు శిక్షణ కేంద్రాలపై ఓ నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: విభజన వల్ల పోలీసు శిక్షణ కేంద్రాల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన నస్టాన్ని భర్తీ చేయటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు సాంకేతిక సహాయ మంత్రి వైఎస్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడుతో కలిసి ఆయన శుక్రవారం హోమ్ మంత్రితో సమావేశమయ్యారు. పునర్విభజన చట్టంలో చేసిన హామీల అమలులో భాగంగా పోలీసు శిక్షణ కేంద్రాలను ఏపిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అవిభక్త రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున రెండు రాష్ట్రాలు సంయుక్తంగా వాటిని ఉపయోగించుకునేందుకునే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరారు. సంయుక్తంగా వాడుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో విధి విధానాలను రూపొదించుకోవచ్చని చౌదరి తెలిపారు. ప్రస్తుతం సెలవులో ఉన్న కేంద్ర హోమ్ కార్యదర్శి విధుల్లోకి చేరాక ఓ సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా లేదాప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి లభించే నిధులపై సమాచారం లేదని చెప్పారు. ఏపిని అతులాకుతలం చేసిన వర్షాలపై కేంద్రానికి నివేదికను అందించినట్టు ఆయన చెప్పారు.