జాతీయ వార్తలు

వీరభద్ర సింగ్‌పై ఈడి ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: మనీలాండరింగ్ కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు రాష్ట్రాల్లోని కనీసం 12 చోట్ల ఈడి సోదాలు నిర్వహించింది. రాజధాని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లోని పలు సంస్థల్లో తనిఖీలు చేసినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. విరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. శుక్రవారం తెల్లవారుజామునే సోదాలు మొదలెట్టినట్టు అధికారులు తెలిపారు. సింగ్‌కు చెందిన సంస్థకు కొన్ని వ్యాపార సంస్థల నుంచి సమకూరిన నిధులపై ఈడి ఆరా తీసింది. 12 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో పలు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. సెప్టెంబర్‌లో వీరభద్ర సింగ్‌పై నగదు బదిలీ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఏ)కింద కేసు నమోదైంది. సిబిఐ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. శుక్రవారం నాటి సోదాల్లో కీలక పత్రాలు లభించినట్టు ఈడి వర్గాలు ధృవీకరించాయి. 2009-11 సంవత్సరాల్లో సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సింగ్, ఆయన కుటుంబ సభ్యులు 6.1 కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రిగా ఉండగానే వీరభద్ర సింగ్ పలు బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిబిఐ స్పష్టం చేసింది. సింగ్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఎల్‌ఐసి ఏజెంట్ చౌహాన్ ద్వారా పాలసీలు తీసుకున్నట్టు తెలిపారు. తమకు వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చిన సొమ్ములతో పాలసీలు చేసినట్టు 2012 ఐటి రిటర్న్స్‌లో సింగ్ చూపించారు.

స్మృతి విద్యార్హతల కేసులో ఇసి, ఢిల్లీ వర్శిటీకి నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించి ఢిల్లీ కోర్టు ఎన్నికల సంఘం, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేసింది. స్మృతి డిగ్రీ చదవలేదని ఆమె ఎన్నికల సందర్భంగా సమర్పించి అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి విద్యార్హతలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆకాష్ జైన్ ఇసికి, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి నోటీసులు ఇచ్చింది. స్మృతి విద్యార్హతలకు సంబంధించి రికార్డులు కోర్టు ముందు ఉంచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఆమె అఫిడవిట్ కాపీలు అలాగే విద్యార్హతలు దానికి సంబంధించిన వివరాలు తమ ముందు ఉంచాలని నోటీసులో స్పష్టం చేశారు. పది, 12వ తరగతికి సంబంధించిన సిబిఎస్‌ఇ నుంచి రికార్డులు పరిశీలించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఫ్రీలాన్స్ రైటర్ అమీర్‌ఖాన్ మంత్రి విద్యార్హతలపై కోర్టులో సవాల్ చేశారు. విద్యార్హతలు లేకపోయినా ఎన్నిక సందర్భంగా అందజేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషనర్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని తప్పుదోవపట్టించిన స్మృతి ఇరానీపై చర్య తీసుకోవాలని ఖాన్ కోర్టును అభ్యర్థించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మంత్రికి జరిమానా విధించడంతోపాటు ఆరునెలల జైలుశిక్ష విధించవచ్చని పిటిషనర్ వాదించారు.