జాతీయ వార్తలు

ప్రాణం తీసిన మృతపిండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్బా, సెప్టెంబర్ 21: కడుపులో ఉన్న మృతపిండంతోనే ఆ మహిళ చికిత్స కోసం ప్రాధేయపడింది. కడుపులో తీవ్రంగా నొప్పి వస్తోందని ఆపరేషన్ చేయాలంటూ వైద్యులను అభ్యర్థించింది. కానీ ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే డబ్బు కట్టనిదే చికిత్సే లేదు పొమ్మన్నారు... ఒకటి కాదు, రెండు కాదు అనేక ఆసుపత్రుల చుట్టూ రెండురోజుల పాటు తిరిగింది. అన్నిచోట్ల అదే పరిస్థితి. అన్నీ సమకూర్చుకుని ఆపరేషన్‌కు సిద్ధమయ్యేలోగానే కడుపులో పిండం విషతుల్యంగా మారడంతో తల్లి ప్రాణానే్న బలిగొంది. వినడానికే దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగింది. మృత పిండాన్ని తొలగించుకోవడానికి 22 ఏళ్ళ ఓ గర్భిణి చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని అనేకమంది డాక్టర్ల చుట్టూ తిరిగింది. అయితే ఈ ఆపరేషన్ చేయడానికి భారీ ఖర్చు అవుతుందని చెప్పిన డాక్టర్లు ఆ మొత్తాన్ని ఆమె చెల్లించే స్థితిలో లేకపోవడం వల్ల వైద్యం చేయలేదు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ సోకి ఆమె మరణించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకోవాలని ఆదేశిస్తూ ముగ్గురు సభ్యులతో ఓ దర్యాప్తు కమిటీని దయానంద్ ఏర్పాటుచేశారు. సరస్వతీ మహంత్ అనే ఈ మహిళ సోమవారం ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిందని కలెక్టరే వెల్లడించారు. పొట్టలో చాలా తీవ్రంగా నొప్పి వస్తోందని చెప్పడంతో సరస్వతిని సోమవారం ఆమె భర్త గులాబ్‌దాస్ మహంత్ స్థానిక మెటర్నటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ జరిగింది. ఆమె కడుపులో ఉన్న ఎనిమిది నెలల పిండం మృతిచెందినట్లుగా నిర్ధారించారు. దీన్ని తొలగించాలని, అందుకు పదివేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అంతేకాకుండా ఆపరేషన్ వల్ల చాలా రక్తం పోయే అవకాశం కోల్పోతుంది కాబట్టి ఆ రక్తాన్ని కూడా సమకూర్చాలని వైద్యులు చెప్పినట్లు గులాబ్‌దాస్ చెప్పారు.