జాతీయ వార్తలు

ఆ రెండూ చట్ట విరుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో వాదించింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్తప్రాజెక్టులను చేట్టేందుకు వీలులేదని ఏపి ప్రభుత్వం తమ ప్రజెంటేషన్‌లో స్పష్టం చేసింది. కొత్త నీటిపారుదల పథకాలను మొదట సంబంధిత నదీయాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం ఆమోదించవలసి ఉంటుందన్నారు. ఆ తరువాతే అపెక్స్ కౌన్సిల్ వీటికి అనుమతి ఇచ్చే విషయం పరిశీలించవలసి ఉంటుందని ఏపి ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూలులోని పదో పేరా ప్రకారం హంద్రీ-నీవా, తెలుగుగంగ, గాలేరు-నగిరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయవలసి ఉన్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు ఈ జాబితాలో లేవు కాబట్టి వీటిని నిర్మించేందుకు వీల్లేదని ఏపి ప్రభుత్వం వాదించింది. ఈ రెండు ప్రాజెక్టులు చట్ట విరుద్ధమని ఏపి ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డిపిఆర్‌లను కెఆర్‌ఎంబి, సిడబ్లుసి, అపెక్స్ కౌన్సిల్ పరిశీలన కోసం అందజేయాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాజెక్టులకు 72 జిఓతో ఎలాంటి సంబంధం లేదన్నారు. పాలమూరు కొత్త ప్రాజెక్టు కాబట్టే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబందించిన జిఓను 2015లో జారీ చేసిందని ఏపి ప్రభుత్వం తెలిపింది. డిండి ప్రాజెక్టుకు 2007లో జారీ చేసిన 159 జిఓతో ఎలాంటి సంబంధం లేదని ఏపి స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జిఓను తెలంగాణ ప్రభుత్వం 2015లో జారీ చేసింది కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. తెలంగాణ తమకు కేటాయించిన 295.86 టిఎంసిల జలాలను పూర్తిగా ఉపయోగించుకుంటోందని ఏపి ప్రభుత్వం తెలిపింది. తెలంగాణాకు అదనపు జలాలను కేటాయించే అవకాశం ఎంత మాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రెండు ప్రాజెక్టుల మూలంగా ఇతర ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఏపి వాదించింది. కృష్ణా జలాల నిర్వహణా బోర్డు ఆదేశాలను వెంటనే అమలు చేయాలన్నారు. కెఆర్‌ఎంబి పరిధిని వెంటనే ప్రకటించాలని, ఇది ఆలస్యమయ్యే పక్షంలో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల హెడ్ రెగ్యులేటర్లను ఆయా రాష్ట్రాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపి డిమాండ్ చేసింది. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు తమకు సమ్మతమేనని ఏపి తెలిపింది. టెలిమెట్రీ వ్యవస్థను అన్ని ప్రాజెక్టుల్లో ఒకే దశలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన నీటిపారుల ప్రాజెక్టుల నీటి వినియోగాన్ని మదింపు చేసే వ్యవస్థ ఏర్పాటు కావాలన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుండి నీటిని మళ్లించినందుకు తెలంగాణాకు వాటా ఇవ్వాలనేది తమక సమ్మతం కాదని ఏపి స్పష్టం చేసింది.