జాతీయ వార్తలు

మోదీ జీ వాస్తవాలు తెలుసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బిజెపి అనుభవించినన్ని కష్టాలు ఏ పార్టీ అనుభవించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలోనే విరుచుకుపడింది. దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో నాటి బ్రిటీష్ పాలకులతో కుమ్మక్కైంది నేటి అధికార పార్టీ తొలిరూపాలైన జనసంఘ్, ఆరెస్సెస్‌లేనని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్య్రోద్యమానే్న మోదీ వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ఆరు దశాబ్దాల కాలంలో బిజెపి ఎన్నో అవమానాలకు గురైందన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు బ్రిటీష్ పాలకులతో కుమ్మక్కైంది జనసంఘ్, ఆరెస్సెస్‌లేనన్న వాస్తవాన్ని మోదీ వక్రీకరించేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. జనసంఘ్ సంస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీతోపాటు సంఘ్ పరివార్‌పైన, వీర్‌సావర్కర్‌పైన కూడా ఆయన ధ్వజమెత్తారు. క్విట్ ఇండియా ఉద్యమం తారాస్థాయిలో ఉన్న సమయంలో దాన్ని ఏవిధంగా ఏదుర్కోవాలన్న దానిపై నాటి బెంగాల్ గవర్నర్‌కు లేఖ రాసింది శ్యాంప్రసాద్ ముఖర్జీయేనన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదన్నారు. వాస్తవికంగా సత్యదూరమైన ప్రకటనను మోదీ చేయడం ఆయన నిర్వహిస్తున్న ప్రధాని పదవికే అవమానమని పేర్కొన్నారు.
అంతేకాదు, మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లభబాయ్ పటేల్ సహా వేలదిమంది చేసిన త్యాగాలను వక్రీకరించడమేనని వెల్లడించారు. మొత్తంమీద దేశంలో బిజెపి అధికారంలో ఉన్నది పదమూడేళ్లేనని, అంతకుమించిన కాలానే్న బ్రిటీష్ హయాంలో జవహర్‌లాల్ నెహ్రూ జైల్లో గడిపారని ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. 1942 నుంచీ ఆరెస్సెస్ జారీ చేసిన సర్క్యులర్లు అన్నీ కూడా బ్రిటీష్ హోం డిపార్క్‌మెంట్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకూడదని ఆరెస్సెస్ నిర్ణయం తీసుకుందని, అలాగే సంఘ్ పరివార్‌కు చెందిన ఎవరూ కూడా అందులో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసిందని ఆనంద్ శర్మ గుర్తు చేశారు.
దేశ స్వాతంత్య్రోద్యమం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందింది తన సహచరులు, తమ పార్టీయేనన్న వాస్తవాన్ని మోదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం వారు అధికారంలో ఉన్నారంటే అందుకు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రధాన కారణమన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు.