జాతీయ వార్తలు

మోదీకి తిరుగులేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీకి ఇప్పటికి తిరుగులేదని భారతీయ రాజకీయ రంగంలో ప్రముఖుల పాపులారిటీకి సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. భారతీయ ఓటర్ల హృదయాల్లో ప్రధాని మోదీకి ఇప్పటికీ తిరుగులేని స్థానం ఉందని ‘మూడ్ ఆఫ్ ది ఇండియా’ పేరుతో ‘ఇండియా టుడే’ మ్యాగజైన్ నిర్వహించిన ఈ సర్వే తేటతెల్లం చేసింది. ఒక వేళ ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని పదవికి మోదీ ఇప్పటికీ తొలి ఫేవరేట్ అవుతారని కార్వీ ఇన్‌సైట్‌తో కలిసి నిర్వహించిన ఆ సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం రెస్పాండెంట్లు మోదీ ప్రధాని కావాలని కోరుకోగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 13 శాతం ఓట్లతో ఎంతో దూరంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిలిచారు. ప్రధాని మోదీ పాపులారిటీ ఆయన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉండే వ్యతిరేకతను సైతం అధిగమించగలదని కూడా ఆ సర్వే పేర్కొంది. ఒక వేళ ఇప్పుడు గనుక లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 304 స్థానాలు లభిస్తాయని ఆ సర్వే పేర్కొంది. 2014లో ఎన్డీఏ కూటమికి లభించిన 336 స్థానాలతో పోలిస్తే స్థానాలు తగ్గినప్పటికీ మెజారిటీ ప్రజలు ఎన్డీఏ నాయకులే తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
అయితే ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఉన్న ప్రధానమంత్రులందరిలోకి ఎవరు ఉత్తమమైన వారని మీరు భావిస్తున్నారని ఓటర్లను అడగ్గా అందరు కూడా ముక్తకంఠంతో ఇందిరాగాంధీయేనని చెప్పడం గమనార్హం. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ముఖ్యమంత్రుల పాపులారిటీ రేటింగ్స్‌లో బిహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్‌లు చెరి 14 శాతం ఓట్లతో తొలి స్థానంలో నిలవగా, మమతా బెనర్జీ రెండోస్థానంలో శివరాజ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. 19 రాష్టల్ల్రోని 97 పార్లమెంటు స్థానాల్లో ఈ పాపులారిటీ సర్వే నిర్వహించారు.