జాతీయ వార్తలు

‘మాన్సీ’కి దక్కిన అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంకోసం ప్రాణాలర్పించిన లాబ్రాడర్ జాతికి చెందిన నాలుగేళ్ల సైనిక శునకం ‘మాన్సీ’ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ సర్ట్ఫికెట్‌తో గౌరవించింది. దేశ సైనిక చరిత్రలో మరణానంతరం ఈ అరుదైన అవార్డుకు ఎంపికైన తొలి శునకం బహుశా ఇదే. ఉత్తర కాశ్మీరులో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను ప్రతిఘటించే క్రమంలో మాన్సీతో పాటు దాని సంరక్షకుడు బషీర్ అహ్మద్ ప్రాణాలర్పించారు. మాన్సీని ప్రభుత్వం ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ సర్ట్ఫికెట్‌తో గౌరవించడంతో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనిక శునకంగా దాని పేరు గెజిట్‌లో చేరనుంది. కాగా, మాన్సీతో పాటు దేశం కోసం ప్రాణాలర్పించిన బషీర్ అహ్మద్‌ను కూడా ప్రభుత్వం సేనా పతకంతో సత్కరించింది.