జాతీయ వార్తలు

నా నిర్ణయంలో మార్పులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 14: రాజకీయాల్లో చేరాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మణిపూర్ ‘ఉక్కు మహిళ’ ఇరోం షర్మిల స్పష్టం చేశారు. మణిపూర్‌లో వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా) అమలును రద్దు చేయాలన్న తన ప్రచారానికి రాజకీయాల్లో చేరడం ద్వారా నూతన దశ మొదలవుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చేరాలనే షర్మిల నిర్ణయం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొన్ని మిలిటెంట్ సంస్థలయితే ఏకంగా హెచ్చరికలు జారీ చేశాయి. ‘అవును, నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రిని అయితే ప్రజామోదం లేని అఫ్‌స్పాను రద్దు చేయగలను’ అని షర్మిల ఒక వార్తాసంస్థకు చెప్పారు. మీ నిర్ణయంలో ఏమైనా మార్పుందా? అని వేసిన ప్రశ్నకు సమాధానంగా షర్మిల ఈ విషయం చెప్పారు.

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరుగనున్నాయి. ‘ఒకవేళ ప్రజలు నాకు మద్దతివ్వకుంటే, నా దారిలో నేను పోతాను’ అని షర్మిల అన్నారు. అయితే రాజకీయాల్లో తనకు ప్రజలు మద్దతిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.