జాతీయ వార్తలు

చర్చించి పరిష్కరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై ఐరాస నిషేధం విధించకుండా అడ్డుకోవడం, అలాగే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వానికి మెలికలు పెట్టడం సహా అనేక వివాదాస్పద అంశాలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో జరిపిన చర్చల్లో భారత్ ప్రస్తావించింది. దాదాపు మూడు గంటలకు పైగా వాంగ్ ఈతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం చర్చలు జరిపారు. ఈ అంశాలన్నింటినీ పరిష్కరించి సామరస్య పూర్వక ద్వైపాక్షిక వాతావరణాన్ని పాదుగొల్పేందుకు త్వరలోనే నిరాయుధీకరణ అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల సంబంధాల్లో ఎన్నో అపశ్రుతులు చోటుచేసుకున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిష్కరించేందుకు విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా వీరిద్దరూ నిర్ణయించారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్‌తో కలిసి ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేయడంపై కూడా చైనాను భారత్ నిలదీసింది. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్ని పాదుగొల్పేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దానిపైనా విస్తృతంగా చర్చించారు. శాంతి ప్రశాంత వాతావరణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సంకల్పించారు. సుష్మతో సమావేశానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చైనా విదేశాంగ మంత్రి సమావేశమై అనేక అంశాలపై 20నిముషాల పాటు చర్చించారు. భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మోదీ, సుష్మా స్వరాజ్‌లతో చైనా విదేశాంగ మంత్రి జరిపిన చర్చల వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను సాధించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని చైనాకు సుష్మ స్పష్టం చేశారని తెలిపాయి.