జాతీయ వార్తలు

నిఘా నీడలో ఎర్రకోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఘనంగా అత్యంత భద్రతాయుత పరిస్థితుల మధ్య 70వ స్వాంతత్య్ర దినోత్సవాన్ని జరుపుకోడానికి భారత్ సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే ఎర్రకోట చుట్టూ కనీవినీ ఎరుగని రీతిలో విస్తృత భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో కూడా రెప్పవాల్చని నిఘాకు అధికార వర్గాలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన వేదిక వద్ద భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు వీలుగా 8వేల మంది సైనికులను నియోగిస్తున్నారు. దేశ, విదేశీ ప్రముఖులు, లక్షలాది మంది ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు చూసేందుకు వచ్చే అవకాశం ఉండేందుకు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనేక దశల్లో భద్రతా కార్డన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఎన్‌ఐజి స్నైపర్లు, కమెండోలు ప్రధానంగా పనిచేస్తారని తెలిపారు. డ్రోన్‌లు సహా ఏ రకమైన దాడులు జరిగినా తిప్పికొట్టేందుకు కూడా అధికారులు భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలను జల్లెడపట్టిన అధికారులు అక్కడ ఉంటున్న 9వేల మంది వివరాలు కూడా సేకరించారు. ఎర్రకోటకు అభిముఖంగా ఉన్న భవనాలను అన్నింటినీ కూడా భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. అలాగే 605 బాల్కానీలు, 104 కిటికీలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు. వందలాది సిసిటివి కెమెరాలను కూడా భద్రతాచర్యల్లో భాగంగానే ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో పారామిలటరీ దళాలతో మాటు ఢిల్లీ పోలీసులు పాల్గొంటారు. నిజానికి జూలైలోనే ఎర్రకోట భద్రతకు సంబంధించి ప్రాధమిక ఏర్పాట్లు జరిగాయని వీటన్నింటినీ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమీక్షించి లోపాలను తమ దృష్టికి తెస్తున్నాయని అధికారులు తెలిపారు.