జాతీయ వార్తలు

రాజన్‌పై స్వామి మళ్లీ విమర్శనాస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో రాజన్‌పై తాను విమర్శలు చేయడాన్ని ప్రధాని నరేద్ర మోదీ తప్పుపట్టిన తర్వాత స్వామి నెల రోజులుగా రాజన్‌పై కానీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై కానీ ఎలాంటి విమర్శలూ చేయలేదు. అయితే ఆదివారం ఇక్కడ విరాట్ హిందుస్థాన్ సమ్మేళన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మరోసారి రాజన్ ద్రవ్య పరపతి విధానంపై విమర్శలు కురిపించారు. అంతేకాదు మీడియా రాజన్‌ను ఒక దేవదూతగా, తనను ఓ దయ్యంగా చిత్రీకరించడాన్ని కూడా స్వామి తప్పుబట్టారు. రాజన్‌ను సమర్థించడానికి మొత్తం మీడియాకు దేశం వెలుపలి శక్తులు స్ఫూర్తినిచ్చాయని కూడా ఆయన అన్నారు. ‘రాజన్ ఆర్‌బిఐ గవర్నర్ పదవినుంచి తప్పుకుంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని ఆ శక్తులు అన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలలేదు, వాస్తవానికి అవి పెరుగుతున్నాయి’ అని ఆయన అన్నారు. ‘వడ్డీ రేట్లను పెంచడం ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు బ్యాంకులనుంచి రుణాలు పొందడం అసాధ్యంగా చేయడంద్వారా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నారు’ అని ఆరోపించారు. అందుకే వారికి నేను ఒక దయ్యంలాగా, ఆయన మనల్ని కాపాడడానికి విదేశాలనుంచి వచ్చిన ఒక దేవదూతగా కనిపిస్తున్నాము’ అని స్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా స్వామి ఎమర్జెన్సీ సమయంలో తన రాజకీయ జీవితం గురించి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నప్పుడు సంజయ్ గాంధీ ఆదేశాలతో తనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. అయితే మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలేమిటని ఆ తర్వాత విలేఖరులు ప్రశ్నించగా, ఆ విషయం అప్పటి వార్తాపత్రికల్లో ఉందని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ హఠాత్తుగా విధించింది కాదని కూడా స్వామి అన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కొంతకాలంగా సోవియట్లతో కలిసి ఎమర్జెన్సీ విధించడానికి ప్రణాళికలు వేస్తూనే ఉన్నారని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వామి ఎమర్జెన్సీ సమయంలో తన అనుభవాలను, జయప్రకాశ్ నారాయణ్‌తో తన సంభాషణలను గుర్తు చేసుకున్నారు.

ఢిల్లీలో ఆదివారం జరిగిన విరాట్ హిందుస్థాన్ సమ్మేళన్‌లో స్వామిని సన్మానిస్తున్న దృశ్యం