జాతీయ వార్తలు

జాతీయ గీతం బహిష్కరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఆగస్టు 7: అలహాబాద్‌లోని ఓ పాఠశాల ఏకంగా జాతీయ గీతాలాపననే నిషేధించింది. జనగణమన గీతంలోని ‘్భరత భాగ్య విధాత’ అన్నమాట ఇస్లాంకు వ్యతిరేకమంటూ బాగ్‌హరాలోని ఎంఏ కానె్వంట్ స్కూల్ మేనేజర్ జాతీయ గీతాన్ని ఆలపించవద్దని హుకుం జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఇతర సిబ్బంది ఎవరూ జాతీయ గీతాన్ని పాడటానికి వీల్లేదంటూ పాఠశాల మేనేజర్ జియా ఉల్‌హక్ ఆదేశాలు జారీ చేయటంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌తోసహా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన విద్యాశాఖాధికారులు దాదాపు 300మంది విద్యార్థులున్న ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదని తేల్చారు. ఇది పాఠశాల విధాన నిర్ణయమని, నచ్చనివాళ్లు వెళ్లిపోవచ్చని కూడా మేనేజర్ అన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ‘ఈ పాఠశాలలో పనిచేస్తున్న మాలో ఎక్కువమంది చాలా కాలంనుంచి ఉన్నవాళ్లుకారు. గత పనె్నండేళ్లుగా ఈ పాఠశాలలో జాతీయగీతం పాడట్లేదని తెలిసి విస్మయానికి గురయ్యాం. మా మనస్సాక్షి అంగీకరించకపోవటంతో నాతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులం రాజీనామా చేశాం’ అని ప్రిన్సిపాల్ రీతు త్రిపాఠీ తెలిపారు. ‘‘అల్లా ఒక్కడే భాగ్యవిధాత. ఆయనే మన గమ్యాన్ని నిర్దేశిస్తాడు. అలాంటప్పుడు భారత్, భాగ్య విధాత అని ఎలా పలుకుతాం’’ అని జియా ఉల్‌హక్ అన్నారని రీతు తెలిపారు. అలహాబాద్ ప్రాథమిక విద్యాధికారి జైకిరణ్ యాదవ్ మాట్లాడుతూ ‘ఈ పాఠశాలకు గుర్తింపు లేదు. తక్షణం పాఠశాలను మూసివేయాల్సిందిగా నోటీసులిచ్చాం’ అని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని యాదవ్ వివరించారు.