జాతీయ వార్తలు

‘లాభదాయక పదవి’కి నిర్వచనం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ‘లాభదాయక పదవి’ నిర్వహిస్తున్నారన్న పేరుతో పలువురు ప్రజాప్రతినిధులు అనర్హత పొందుతున్నారని, నిజానికి ‘లాభదాయక పదవి’(ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్)కి ఏ చట్టంలో కానీ, ఏ తీర్పులో కానీ ఎలాంటి నిర్వచనం ఇవ్వలేదని పార్లమెంటరీ కమిటీ ఒకటి పేర్కొంది. దీనికి సంబంధించి ఒక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర న్యాయశాఖను ఈ కమిటీ కోరింది. ప్రజాప్రాతినిథ్య చట్టం, ఫిరాయింపు నిరోధ చట్టంలో కానీ, హైకోర్టులు, సుప్రీం కోర్టులిచ్చిన ఏ తీర్పులో కానీ దీనికి సంబంధించి నిర్వచనం చెప్పలేదని అందువల్ల న్యాయశాఖ ఇందుకు సంబంధించి ఓ చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఏయే పదవులు లాభదాయక పదవుల పరిధిలోకి వస్తాయో, ఏవి రావో వివరించాల్సి ఉందని కమిటీ కోరింది. వివిధ కార్యాలయాలు, వ్యవస్థల ఉన్నత పదవులను నిర్వహించే ఎంపిలపై ఏ ప్రాతిపదికన అనర్హత వేటు వేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని పేర్కొంది. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని 1, 2 విభాగాల్లో కొన్ని పదవులను పేర్కొన్నారని, అయితే ఇందులో కొన్నింటిని చేర్చక పోవచ్చని, అదే సమయంలో ప్రతి పదవికి సంబంధించి అది లాభదాయకమైందా కాదా అన్నది పరిశీలించి నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉందని కమిటీ సూచించింది.