జాతీయ వార్తలు

ఎన్నికలకు సిద్ధంకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 5: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు చాలా ముందుగానే సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ కూడా అందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలని పార్టీనేతలు, కార్యకర్తలకు ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. భూ ఆక్రమణలకు ఇతర అనుచిత కార్యక్రమాలకు స్వస్తిపలకాలని హెచ్చరిక స్వరంతో విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్నిరకాలగానూ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, తప్పులను సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీ లోపాలను సరిదిద్దుకోగలుగుతారా? భూ ఆక్రమణలను ఆపగలుగుతారా? వీటి అన్నింటినీ నిరోధిస్తేనే మళ్లీ అధికారం మనది అవుతుంది’ అని ములాయం స్పష్టం చేశారు. డబ్బులు సంపాదించాలంటే భూ ఆక్రమణలే మార్గం కాదని అందుకు ఇతరాత్రా అనేక మార్గాలున్నాయని కార్యకర్తలకు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు సన్నిహితమయ్యే పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పార్టీ నేత జ్ఞానేశ్వర్ మిశ్రా 84వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ములాయం మాట్లాడారు. పార్టీలకు కొత్తగా వచ్చిన కార్యకర్తలకు సామ్యవాదం అంటే తెలియదన్నారు. వారికి శిక్షణ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అఖిలేష్‌ను అనేక సార్లు కోరానని అయితే తన మాటను ఎవరూ పట్టించుకోలేదని ములాయం ఆవేదన చెందారు.
రాజకీయాలు అంత సులభం కాదని ఇందులో రాణించాలంటే కార్యకర్తలకు శిక్షణ అవసరమని ఆయన తెలిపారు. దేశంలోనే యూపీ అతిపెద్ద రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం ఎన్నికల గురించి ఢిల్లీలో చర్చించుకుంటున్నారని అటు కాంగ్రెస్ ఇటు బిజెపిలు రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకునేందుకు నువ్వానేనా అన్నట్టు దూసుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో యువకులు, రైతులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా మహిళల ప్రమేయం పెంచాలని ములాయం కోరారు.

లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అభివాదం చేస్తున్న
సమాజ్‌వాది అధినేత ములాయం, యుపి సిఎం అఖిలేష్ యాదవ్

చత్తీస్‌గఢ్‌లో
ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోలు మృతి బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఘటన

భద్రాచలం/చింతూరు, ఆగస్టు 5: చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తుపాకులు మరోమారు గర్జించాయి. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దంతెవాడ జిల్లా ఫర్సేపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కచేఘాట్ ఏరియాలో శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిసినా కూడా భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిరంతరాయంగా నిర్వహిస్తున్నాయి.
డిఆర్‌జి బలగాలు గురువారం గాలింపు చర్యల్లో భాగంగా కచేఘాట్ అటవీప్రాంతానికి వెళ్లాయి. అక్కడ మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో భద్రతాబలగాలు సోదా చేయగా అక్కడ ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఇద్దరు పురుషులు కాగా మరొకరు మహిళ. లొంగిన నక్సల్స్ ద్వారా మృతులను గుర్తించారు.
ఫగ్గు అలియాస్ నిశాంత్. ఇతనిది బీజాపూర్ జిల్లాలోని మిర్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మధుపూర్ గ్రామం. ఇతను డివిజన్ సప్లయ్ టీం సభ్యుడుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. మంకీ అలియాస్ గీతది ఇదే జిల్లాలోని కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పుష్‌లంక గ్రామం. ఈమె ఇంద్రావతి నేషనల్ పార్కు బోర్డర్ కంపెనీ సభ్యురాలు. సోనూ అలియాస్ అజిత్‌ది సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముక్రం గ్రామం. ఇతను మావోయిస్టు అగ్రనేత పాపారావు గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రివాల్వర్‌లు, బర్మార్ తుపాకులు, డిటోనేటర్లు, గ్రెనైడ్‌లు, మందుపాతరలు, విప్లవసాహిత్యం, నిత్యావసర వస్తువులు, రూ.30వేల నగదు ఎన్‌కౌంటర్ ప్రదేశంలో లభ్యమయ్యాయి.