జాతీయ వార్తలు

ఎన్నికల్లో పోటీ చేస్తే ఇక అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 5: సామాజిక ఉద్యమకారిణి, మణిపూర్ ‘ఉక్కు మహిళ’ ఇరోం షర్మిలకు బెదిరింపులు వస్తున్నాయి. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న నిరాహార దీక్షను కొనసాగించాలని, బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకోవాలని కొన్ని సంస్థలు ఆమెను హెచ్చరించాయి. ఈ నెల 9న 16 ఏళ్లుగా తాను కొనసాగిస్తున్న నిరాహార దీక్షను విరమిస్తానని ఇటీవల ప్రకటించిన షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అలయెన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ కంగ్లీపాక్ (ఎహ్‌యుకె) పేరిట ఏర్పడిన సంస్థ తీవ్రంగా స్పందించింది. లక్ష్యాన్ని విడిచిపెట్టి గతంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన వారంతా హత్యలకు గురయిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే భారత ప్రభుత్వ ఆధిపత్యంనుంచి మణిపూర్‌కు విముక్తి కల్పించాలని ఆ సంస్థ కోరుతోంది.