జాతీయ వార్తలు

హోదాపై వారంలో సానుకూల నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఏపికి ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్రం నుండి వారం రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం వుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి చేప్పారు.శుక్రవారం నాడు ఏపిభవన్‌లో టిడిపి ఎంపీలతో కలిసి సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడారు. టిడిపి ఎంపీలందరమూ ప్రధాని నరేంద్ర మోదీని కలసి ఏపికి ప్రత్యేక హోదా,విభజన హామీలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్, వైకాపాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు. చంద్రబాబుతో పాటు ఎంపీలందరూ విభజన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని చెప్పారు.
రాజ్యసభలో కెవిపి ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కి రాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. తాము లేవనెత్తిన ఆంశాల కారణంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం నాడు రాజ్యసభకు హాజరై గతంలో తాను సభలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారని వెల్లడించారు. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే జీఎస్టీ బిల్లును అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చి వుండేదే కాదన్నారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు మనీ బిల్లుగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. ఈ విలేఖరుల సమావేశంలో టిడిపి ఎంపీలు మాగంటి బాబు, సీతారామలక్ష్మి,పి.రవీంద్ర బాబు పాల్గొన్నారు.

కుదుటపడుతున్న
సోనియా ఆరోగ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం పశ్చిమ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ క్రమంగా కోలుకుంటున్నారు. సోనియాగాంధీని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) నుంచి వేరే గదిలోకి తరలించడం జరిగిందని, ఆమె నిలకడగా కోలుకుంటున్నారని ఆస్పత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ డాక్టర్ డి.ఎస్.రాణా శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పల్మనాలజి (శ్వాసకోశ సంబంధ వ్యాధుల విభాగం)కి చెందిన డాక్టర్ అరుప్ బసు, అతని బృందం పర్యవేక్షణలో ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ భుజం గాయానికి ముంబయికి చెందిన డాక్టర్ సంజయ్ దేశాయ్, సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతీక్ గుప్తాలతో కూడిన వైద్య బృందం శస్త్ర చికిత్స చేశారని ఆయన వివరించారు. వారణాసి పర్యటనలో తీవ్ర అస్వస్థతకు గురయిన సోనియాగాంధీ మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని మిలిటరీ ఆస్పత్రిలో చేరగా, బుధవారం ఉదయం సర్ గంగారాం ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
వారణాసిలో రోడ్‌షో సందర్భంగా ఆమె ఎడమ భుజానికి గాయమయింది. సోనియాగాంధీని గురువారం ఐసియు నుంచి మరో గదిలోకి తరలించారు. బుధవారం రాత్రి వైద్య బృందం ఆమె భుజం గాయానికి శస్తచ్రికిత్స చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ శస్తచ్రికిత్సకు సుమారు రెండు గంటల సేపు పట్టిందని పేర్కొన్నాయి. సోనియాగాంధీ మరో అయిదు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని, ఆమెకు ఫిజియోథెరపి చికిత్స కూడా అవసరం ఉంటుందని ఆ వర్గాలు వివరించాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రాజ్‌బబ్బర్ సహా అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకొని సోనియాగాంధీని పరామర్శించారు.
మణిపూర్‌ను గతంలో కంగ్లీపాక్ అని పిలిచేవారు. ‘ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన వారంతా అదే ముగింపు అనే విషయం బాగా తెలిసే ఆ పనిచేశారు’ అని ఎఎస్‌యుకె చైర్మన్ ఎన్ ఒకెన్, డిప్యూటీ చైర్మన్ కష్‌లబ్ మీటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక తెలిపింది. గోవాకు చెందిన బ్రిటీష్ ఉద్యమకారుడు డెస్మండ్ కౌటినోతో షర్మిలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. ఆయననే ఆమె పెళ్లి చేసుకుంటారని కూడా భావిస్తున్నారు. అయితే డెస్మండ్ ప్రవాస భారతీయుడయినప్పటికీ మణిపూర్ వాసుల దృష్టిలో అతను భారతీయుడేనని, అతడ్ని పెళ్లి చేసుకోవడాన్ని వారు హర్షించరని కూడా ఆ ప్రకటన పేర్కొంది.