జాతీయ వార్తలు

మునిగిన ముంబయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 5: గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబయి మహానగర జీవనం శుక్రవారం తెల్లవారుజామునుంచి కురిసిన భారీ వర్షాలతో తల్లడిల్లిపోయింది. ముంబయితో పాటు సమీపంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కొంకణ్‌తో పాటు మధ్య మహారాష్ట్ర ప్రాంతాలన్నీ వర్ష తాకిడికి గురికావొచ్చునంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శివాజీ టెర్మినస్ నుంచి థాణే మధ్య అన్నిచోట్ల సబర్బన్ సర్వీసులు ఆగిపోయాయి. అనేకచోట్ల ఆరునుంచి ఏడు అంగుళాల మేర రైలుపట్టాలు మునిగిపోయాయని అధికారులు తెలిపారు.