జాతీయ వార్తలు

నాటకాలు బయటపడ్డాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 5: కృష్ణాపుష్కరాల ఆహ్వానం పేరుతో కెవిపి ప్రైవేటు బిల్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు రాజ్యసభలో టిడిపి, బిజెపిల నటనా చాతుర్యాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. రాజ్యసభలో ఏపికి తీవ్ర అవమానం జరిగిందని, సాక్షాత్తు ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. శుక్రవారం నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కల్గిందని, విద్రోహ దినంగా భావిస్తున్నామన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటానికి సిద్ధంగా లేదని,ప్రత్యేహోదా ఇవ్వలేమని చెప్పే ధైర్యం కూడా కేంద్రానికి లేదన్నారు. రాజ్యసభలో ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ పెట్టితీరాలనీ ఎంపీ సిఎం రమేశ్ పట్టుపట్టక పోవడం దురదృష్టకరం అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలపై ఒక తీర్మానం రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. టిడిపి ఎంపిలు కాంట్రాక్టుల కోసమే ప్రధాని నరేంద్రమోదీని కలిశారని విమర్శిచారు.
తెలుగుదేశం పార్టీ బిజెపి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాగా, ఢిల్లీలో మరో విధంగా వ్యవరిస్తుందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం నుండి ఆంధ్రకు ప్యాకేజీ కోసం ఎదుచూస్తున్నారని, ప్యాకేజీలు ఆంధ్రులకు అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కావల్సింది ప్రత్యేకహోదా అని స్పష్టం చేశారు. శాసనసభ స్థానాల సంఖ్య పెంచుకోవాటానికే సిఎం చంద్రబాబు రాజకీయ అజెండాతో ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు ఎవరు చెప్తారో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ నిర్ణయించుకోవాలని డిమాండ్ చేశారు.