జాతీయ వార్తలు

8న లోక్‌సభకు జిఎస్‌టి బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టి అదే రోజు ఆమోదింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఆమోదించిన బిల్లులో కొన్ని సవరణలు చేసినందున ఇది మళ్లీ లోక్‌సభ ఆమోదానికి వస్తోంది. సోమవారం దీనిపై జరిగే చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఈ బిల్లుకు 50శాతం రాష్ట్రాల ఆమోదాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడనందుకు విపక్షాలు దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఆమోదించిన 30రోజుల్లోగా కనీసం పదహారు రాష్ట్రాల అసెంబ్లీలు దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర సీనియర్ మంత్రులు తొమ్మిది ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అసెంబ్లీలను ప్రత్యేకంగా సమావేశ పరిచిమరీ ఈ బిల్లును ఆమోదిస్తామని కొందరు ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.