జాతీయ వార్తలు

నేపాల్ ప్రధానిగా ప్రచండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 3: నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు పార్టీ అధినేత పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ ఎన్నికయ్యారు. కొత్త రాజ్యాంగ పుణ్యమాని రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో కెపి శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిగా ప్రచండను సోమవారం పార్లమెంటు ఎన్నుకుంది. 595 మంది సభ్యులున్న సభలో ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు వచ్చాయి. 210 ఓట్లు వ్యతిరేకంగా రాగా, 22 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అత్యున్నత ప్రధాని పదవికి ప్రచండ ఒక్కరే పోటీపడ్డారు. నేపాల్ మావోయిస్టు పార్టీ అధినేతగా ఉన్న 61 ఏళ్ల ప్రచండ ప్రధాన మంత్రి పదవి చేపట్టడం ఇది రెండోసారి. ప్రధానిగా ఎన్నికైన ఆయన మాట్లాడుతూ నేపాల్‌లో రాజకీయ సుస్థిరత, ఆర్థిక అభివృద్ధికి కృషిచేస్తానని ప్రకటించారు. 2008-2009 మధ్య ఆయన ప్రధానిగా పనిచేశారు. గత నెలలో కెపి శర్మ ఓలి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ కొత్త ప్రధాని ప్రచండను భారత్ అభినందించింది. ప్రచండ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య మైత్రి మరింత బలోపేతం అవుతుందని పేర్కొంది. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆయనను ఆహ్వానించింది.