జాతీయ వార్తలు

లోక్‌సభలో వైకాపా ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు బుధవారం లోక్‌సభ పోడియం వద్ద రెండు గంటల పాటు ధర్నా చేశారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సభ్యులు సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, వర ప్రసాదరావు, అవినాష్‌రెడ్డి ఉదయం 11గంటలకు సభ సమావేశం కాగానే పోడియం వద్దకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు ప్రారంభించారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా నినాదాలు ఇచ్చారు. ఏపీకి ఆర్థిక సహాయం చేయటంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సభలో ఒక ప్రకటన చేసిన తరువాత కూడా మీరిలా పోడియం వద్ద గొడవ చేయటం మంచిది కాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించటం నియమాలకు విరుద్ధమనేది మీకు తెలియదా? అని ఆమె వైకాపా ఎంపీలను ప్రశ్నించారు.
మీ సీట్లలోకి వెళ్లాలంటూ ఆమె పలుమార్లు విజ్ఞప్తి చేసినా వైకాపా సభ్యులు మాత్రం పట్టించుకోలేదు. ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, మాజీ ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అంటూ వారు సభలో నినాదాలు ఇచ్చారు. పదకొండు గంటల నుండి పనె్నండు గంటల వరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగినంత సేపు వారు ప్రత్యేక హోదా కోసం నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఒంటి గంటకు భోజన విరామ సమయం ప్రకటించేంత వరకు కూడా వారు తమ నిరసన కొనసాగించారు. అయితే వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా పెద్ద గొంతుతో నినాదాలు ఇవ్వలేకపోకపోవటంతో సభా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగలేదు.