జాతీయ వార్తలు

మోదీతో నేడు బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. నరేంద్ర మోదీ మొదట తెలుగుదేశం ఎంపీలతో సమావేశమై ఆ తరువాత చంద్రబాబును కలుస్తారని అంటున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠక్కర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తోపాటు పలువురు ప్రముఖులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం విజయవాడ నుండి బయలు దేరుతున్న చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి చేరిన వెంటనే ప్రధానితో సమావేశం అవుతున్నట్లు తెలిసింది. ప్రధానితో బాబు సమావేశం ఏర్పాటు వెనక కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు,సుజనా చౌదరి హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం సభ్యులు రెండు రోజుల పాటు లోక్‌సభను స్తంభింపజేయటం తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలపై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం పట్ల తెలుగుదేశం ఎంపీలతోపాటు చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఇక మీదట ఓపిక పట్టటం సాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయం లేదా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని తెలుగుదేశం నాయకులు పరోక్షంగా సూచిస్తున్నారు. ప్రధాని గురువారం ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా అందజేసే ఆర్థిక సహాయం గురించి వివరిస్తారని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఎంతైతే ఆర్థిక సాయం అందుతుందో అంతకంటే కొంత ఎక్కువ సహాయాన్ని అందజేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే దాని వలన కలిగే ఆర్థిక ప్రయోజనాలను ఏపీకి అందజేయాలన్నది కేంద్రం వ్యూహంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పలు ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తాయని ఎన్డీఏ ప్రభుత్వం అంటోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కూడా కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలు లేదు కాబట్టే హోదా స్థానంలో ఆ మేరకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. నరేంద్ర మోదీ రేపు చంద్రబాబుకు ఈ అంశాలన్నీ వివరించి హోదా స్థాయిలో ఆర్థిక సాయం ప్రతిపాదనకు ఆయనను ఒప్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడిందనేది చంద్రబాబు ప్రధానికి వివరించి కేంద్రం ఎలాంటి సహాయం చేయాలనుకున్నా వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతారు.
ప్రధాని ఆదేశం మేరకు ఏపీకి చేయవలసి ఆర్థిక సహాయం ప్యాకేజీ గురించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సమాలోచనలు జరుపుతున్నారు. వీరితోపాట పాటు ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఈ అంశంపై దృష్టి సారించిందని అంటున్నారు. ముగ్గురు సీనియర్ నాయకుల సిఫారసులు, ప్రధాన మంత్రి కార్యాలయం చేసే ప్రతిపాదనల ఆధారంగా ప్రత్యేక ఆర్థిక సహాయం, ప్యాకేజీ ప్రకటన ఉంటుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.