జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు అమృత్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అమృత్ పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు 1,432 కోట్ల పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 877 కోట్లు, తెలంగాణాకు 555 కోట్ల రూపాయలు పెట్టుబడులకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 877 కోట్ల పెట్టుబడుల్లో కేంద్ర సహాయం 352 కోట్లు. ఇదిలా ఉంటే మంచినీటి సరఫరా పథకాల కోసం 488 కోట్లు, డ్రేనేజీ పథకాలకు 269 కోట్లు వర్షం నీటి డ్రేన్లకు102 కోట్లు, పట్టణ రవాణాకు 18 కోట్లు, ఉద్యానవనాలకు 18 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.తెలంగాణా రాష్ట్రానికి ఆమోదించిన 555 కోట్ల పెట్టుబడుల్లో కేంద్ర సహాయం 277 కోట్ల రూపాయలుగా నిర్దారించారు. మంచినీటి సరఫరాకు 502 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సివరేజ్ పథకాలకు 40 కోట్లు, ఉద్యానవనాలకు 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ విస్తీర్ణ, పట్టణ రవాణా, ఉద్యానవనాల కోసం 4,404 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని ఎం.వెంకయ్యనాయుడు నాయకత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంగళవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ (అమృత్), అటల్ మిషన్ ఫర్ రెజునవేషన్ పథకాల కింద ఈ పెట్టుబడులు పెడతారు.