జాతీయ వార్తలు

వారణాసి వీధుల్లో సోనియా రోడ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఆగస్టు 2: దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారీస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో రోడ్‌షోతో సోనియా ప్రచార సంరంభం ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా ఆమెకు తీవ్రంగా జ్వరం రావటంతో ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఆమె వెళ్లిపోయారు. వారణాసి సర్క్యూట్ హౌస్ దగ్గర బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయటంతో ప్రారంభమైన సోనియా రోడ్‌షో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర సాగింది. మొదట కార్లో ప్రయాణించిన సోనియా.. ఆ తరువాత ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించారు. ఆమె రోడ్‌షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ‘27 సంవత్సరాల్లో అన్యాయమైన యూపి’ నినాదంతో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఆమె వెంట యూపి ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, ప్రమోద్ తివారీ, సంజయ్‌సింగ్, రాజ్‌బబ్బర్‌లు పాల్గొన్నారు. వందలాది కార్యకర్తలు మోటార్ బైక్‌లపై ఆమెను అనుసరించారు. మోదీ వారణాసి నుంచి ఎన్నికై ప్రధాని అయిన తరువాత సోనియా ఇక్కడికి రావటం ఇదే మొదటి సారి. సాయంత్రం కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రార్థనలు చేయాల్సి ఉన్నా జ్వరం రావటంతో సోనియా వెళ్లిపోయారు.
chitram...
వారణాసిలో మంగళవారం సోనియా నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన జనం