జాతీయ వార్తలు

2.16కోట్ల బోగస్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశవ్యాప్తంగా 2.16 కోట్ల బోగస్ కార్డులను గుర్తించడం జరిగిందని, ఈ బోగస్ కార్డుల కారణంగా పక్కదారి పట్టనున్న దాదాపు 13వేల కోట్ల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకు అందుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 60 శాతం రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సిఆర్ చౌదరి చెప్పారు. దాదాపు 2.16 కోట్ల నకిలీ లేదా బోగస్, డూప్లికేట్ కార్డులను గుర్తించడం జరిగిందని, దీనివల్ల పక్కదారి పట్టనున్న 13 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకే లభిస్తాయని ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. రేషన్ కార్డుల డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం పూర్తి చేసిందని కూడా ఆయన చెప్పారు. పాలలో కల్తీపట్ల వ్యక్తమవుతున్న ఆందోళనపై అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఇది నిజంగా తీవ్రమైన సమస్యేనని, కల్తీని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చాలా ఏళ్లనాటి వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక బిల్లును ప్రతిపాదించిందని ఈ దశలో జోక్యం చేసుకుంటూ వినియోగదారుల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. వినియోగదారుల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను చేపట్టడానికి పది కోట్ల రూపాయల మూలనిధితో వినియోగదారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తున్నట్లు పాశ్వాన్ ఒక లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. ఈ నిధిలో 75 శాతం వాటాను కేంద్రం భరిస్తుందని, మిగతా 25 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో ఈ నిష్పత్తి 90:10గా ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, నాగాలాండ్, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా రాష్ట్రాల్లో ఈ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు పాశ్వాన్ తెలిపారు.