జాతీయ వార్తలు

బిజెపితో దేశం కుమ్మక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 2: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కుమ్మక్కు అయినందుకే ఏపికి ప్రత్యేక హోదా రావటం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎం.ఏ.ఖాన్ ఆరోపించారు.
ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసిన లేఖలో ఖాన్ ఈ ఆరోపణలు చేశారు. ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఇటీవల రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరు, బిజెపి నాయకులను పొగుడుతూ చేసిన ప్రసంగాలే ఇందుకు నిదర్శమని ఖాన్ పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం ఎంపిలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను అవమానించేదిగా ఉందన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చకు సంబంధించిన వీడియో చూస్తే తెలుగుదేశం సభ్యుల వ్యవహారం ఏమిటనేది అర్థమవుతుందని ఆయన చంద్రబాబుకు సూచించారు. బిజెపి-తెలుగుదేశం పార్టీల నిజ స్వరూపం ఏమిటనేది ఏపి ప్రజలకు తెలిసిపోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినా ఏపి ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నదని ఆయన స్పష్టం చేశారు.
ఏపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు.