జాతీయ వార్తలు

డిసెంబర్ 31లోగా ఆస్తులు వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విదేశీ, దేశీయ గ్రాంట్లు పొందే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) వాటి ఎగ్జిక్యూటివ్‌లు తమ ఆస్తులు, అప్పుల వివరాలను పొడిగించిన గడువు అయిన డిసెంబర్ 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.
కొత్త డీడ్‌లైన్‌ను నోటిఫై చేస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం( డిఓపిటి) శుక్రవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. లోక్‌పాల్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములు, పిల్లల ఆస్తులు, అప్పుల వివరాలను ప్రతి ఏటా మార్చి 31లోగా తప్పకుండా దాఖలు చేయాలి. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ వివరాలను దాఖలు చేయాలి.ఇంతకు ముందు కూడా ప్రతి ఏటా ఒకటి, రెండు సార్లు ఈ గడువును పొడిగించే వారు. అయితే ఈ సారి ఈ గడువును ఇప్పటికి ఆరుసార్లు పొడిగించడం జరిగింది. అయిదో గడువు ఆదివారంతో ముగియనుండడంతో ఇప్పుడు తాజాగా మరోసారి గడువు పెంచారు. కాగా, స్వచ్ఛంద సంస్థలు, వాటి ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించి మాత్రం ఇది మొదటి పొడిగింపు. లోకాయుక్త, లోక్‌పాల్‌ల సవరణ బిల్లును పార్లమెంటు గురువారం ఆమోదించడంతో ఈ గడువును ఆరు నెలలు పొడిగించడం జరిగింది. లోక్‌సభ బుధవారం ఈ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ గురువారం ఆమోదించింది.