జాతీయ వార్తలు

మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 22: దళితుల ఆందోళనలతో అట్టుడికిన గుజరాత్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. బోటా డ్ జిల్లాలో ఆవుచర్మం క్రయిస్తున్నారన్న ఆరోపణలతో నలుగురు దళితులను అర్థనగ్నం చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అనేక ప్రాంతాల్లో మూడు రోజులుగా హిం సాత్మక సంఘటనలు జరిగాయి. కాగా దోషులను శిక్షించాలని డిమాం డ్ చేస్తూ జిల్లాలో మరో ముగ్గురు దళిత యువకులు ఆత్మాహత్యకు ప్రయత్నించారు. నిరసన కార్యక్రమం చేపట్టిన ముగ్గురు దళితులు విషం తాగారని పోలీసులు వెల్లడించారు. ఉన దాడికి నిరసనగా వారు అఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్థులు సమాచారం అందించినట్టు పోలీసులు చెప్పారు. వెంటనే ముగ్గురు దళిత యువకులను సమీప ఆసుపత్రిలో చికిత్స చేయించి భావ్‌నగర్‌కు తరలించినట్టు ఎస్‌పి సరోజ్ కుమారి తెలిపారు. ఉన దారుణ ఘటనకు నిరసనగా ఇప్పటి వరకూ 20 మంది ఆత్మహత్య యత్నం చేసినట్టు ఎస్‌పి వెల్లడించారు. ఆత్మహత్యాయత్నం సమాచారం తెలిసి వందలాది మంది దళితులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్టు సరోజ్ కుమారి పేర్కొన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు వదొదర జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టి ట్రాఫిక్‌ను ఆపేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు. అహ్మదాబాద్, పటాన్ జిల్లాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆర్వల్లీ జిల్లాలోని మదోసాలో దళితుల ఆందోళలతో బంద్ జరిగింది.

గిర్‌సోమ్‌నాథ్ జిల్లాలో ఈనెలాఖరు వరకూ నిషేధాజ్ఞలు విధించినట్టు కలెక్టర్ అజయ్‌కుమార్ వెల్లడించారు.