జాతీయ వార్తలు

నిలకడైన అభివృద్ధిలో వెనుకబడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూలై 22: నిలకడయిన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి)ను సాధించడంలో భారత్ బాగా వెనుకబడి పోయింది. నిలకడయిన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 149 దేశాలకు చెందిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వగా, భారత్ 110వ స్థానంలో నిలిచింది. ఈ తాజా సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఎస్‌డిజిలను సాధించడంలో అన్ని దేశాలు పెద్ద సవాళ్లనే ఎదుర్కొంటున్నాయని ఈ సూచీ వెల్లడించింది. ద సస్టెయినేబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (ఎస్‌డిఎస్‌ఎన్), బెర్టెల్స్‌మన్ స్ట్ఫిటుంగ్ ఈ కొత్త నిలకడయిన అభివృద్ధి లక్ష్యాల సూచీని ప్రారంభించాయి. నిలకడయిన అభివృద్ధి లక్ష్యాల సాధనలో వివిధ దేశాల పురోగతిని వెల్లడించడంతో పాటు జవాబుదారీతనాన్ని పాదుకొల్పడానికి ఈ సూచీని రూపొందించాయి. ఎస్‌డిజిలను సాధించడంలో ప్రతి దేశం 2016లో ఎక్కడ ఉందనే విషయాన్ని అంచనా వేయడానికి 149 దేశాలకు చెందిన అందుబాటులో ఉన్న గణాంకాలను ఈ సూచీ సేకరించింది. అయితే ఎస్‌డిజి లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్న దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలేమీ కావు. చిన్న, అభివృద్ధి చెందిన దేశాలే కావడం విశేషం. సూచీలో స్వీడన్ అగ్రస్థానంలో ఉండగా, డెన్మార్క్, నార్వే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జి-7 దేశాలలో కేవలం రెండు దేశాలు జర్మనీ (6వ స్థానం), బ్రిటన్ (10వ స్థానం) మాత్రమే టాప్ టెన్ దేశాల జాబితాలో చోటు సంపాదించాయి. అగ్రరాజ్యం అమెరికా 25వ ర్యాంక్‌ను పొందగా, రష్యా 47వ, చైనా 76వ ర్యాంకును పొందాయి. భారత్ 110 స్థానంలో నిలవగా, దాని తరువాత లెసోతో 113వ స్థానంలో, పాకిస్తాన్ 115వ స్థానంలో, మైన్మార్ 117వ స్థానంలో, బంగ్లాదేశ్ 118వ స్థానంలో, అఫ్గానిస్తాన్ 139వ స్థానంలో నిలిచాయి.