జాతీయ వార్తలు

అభినవ ‘ శ్రీమంతుడు’ కష్టం తెలుసుకున్న కోటీశ్వరుడి కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, జూలై 22: అతనో ఆగర్భ శ్రీమంతుడు. దేనికీ లోటు లేదు. ఒకరకంగా చెప్పాలంటే అతని జీవితం వడ్డించిన విస్తరి. కానీ అతని తండ్రి భిన్నంగా ఆలోచించాడు. జీవిత సత్యాల్నీ, పేదరికంలోని కష్టాల్నీ, ఉద్యోగం కోసం యువత పడుతున్న ఇబ్బందుల్ని అనుభవ పూర్వకంగా తెలియజేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతనికి కొన్ని నిబంధనలు పెట్టి ఏకంగా వనవాసమే పంపించాడు. ‘నెల రోజులపాటు నీ సంపాదన నీవే సంపాదించుకోవాలి... వారానికి మించి ఒకచోట పనిచేయకూడదు... నా పేరుగానీ, మొబైల్‌గానీ వాడకూడదు, నేను ఇచ్చిన సొమ్ము అత్యవసరమైతేనే వాడాలి’ - ఇవీ కోటీశ్వరుడైన ఆ తండ్రి తన కుమారుడికి పెట్టిన నిబంధనలు! తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన అతడు ఆ సవాలును స్వీకరించాడు. ఈ వనవాసాన్ని గడిపేందుకు కేరళలోని కొచ్చిని ఎంచుకున్నాడు. తండ్రి చెప్పినట్లే నెలరోజులపాటు బతుకు వెళ్లదీశాడు. ఎవరికీ అనుమానం రాకుండా, అక్కడి భాష రాకపోయినా నెల రోజుల జీవితాన్ని పూర్తిచేసి జీవిత పాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ శ్రీమంతుడే ద్రవ్యా ధోలాకియా! సినిమా కథను తలపించేలా ఉన్నా నేటి యువతకు స్ఫూర్తినిచ్చే వాస్తవ కథ! ఫేస్‌బుక్‌లు, ఫోకెమాన్‌ల వెంటపడుతూ కాలాన్ని వృథా చేస్తున్న నేటి యువతకు ఇదొక ‘పాఠమే’! ఓ ఆంగ్ల దినపత్రిక ఈ కథనాన్ని ప్రచురించడంతో స్ఫూర్తిదాయకమైన ఈ ఘటన వెలుగుచూసింది.
గుజరాత్‌కు చెందిన అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి శాజీ ధోలాకియా గుర్తుండే ఉంటారు. తమ కంపెనీలో హరేకృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో పనిచేసే ఉద్యోగులకు బోనస్‌గా కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చిన వితరణ శీలి ఆయన. అతని కుమారుడే ద్రవ్యా ధోలాకియా! అమెరికాలో ఎంబిఏ చదువుతున్న ద్రవ్య సెలవులకు ఇండియా వచ్చాడు. సెలవులను వృథాగా గడపకుండా తండ్రి అతడికి పెట్టిన ‘పరీక్ష’ ఇది. జూన్ 21న ప్రారంభమైన ద్రవ్య వనవాసం ఈ నెల 21కి ముగిసింది.
మూడు జతల బట్టలు, ఏడువేల నగదుతో కొచ్చి చేరిన ద్రవ్యకు ఎదురైన అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ‘మొదటి ఐదు రోజులు ఉద్యోగం లేదు, ఉండటానికి చోటు లేదు. అరవై చోట్ల తిరస్కారం ఎదురుకావడంతో నాలో అసహనం పెరిగిపోయింది. తిరస్కారం విలువ ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. దీంతో పాటు ఉద్యోగం విలువ కూడా తెలిసొచ్చింది’ అంటాడు ద్రవ్య. గుజరాత్‌లోని ఓ పేద కుటుంబానికి చెందినవాడినని, తాను ఇంటర్ చదువుతున్నానని అబద్ధం కూడా చెప్పాడు. ఎక్కడా కొలువు దొరక్కపోవడంతో కాల్‌సెంటర్‌లో ఓసారి, చెప్పుల దుకాణంలో మరోసారి, మెక్‌డొనాల్డ్స్‌లోనూ దినసరి వేతనంపై పనిచేశాడు. ఇలా పనిచేసి ఈ నెల రోజుల్లో నాలుగువేల రూపాయలు సంపాదించాడు.
‘నేనెప్పుడూ డబ్బు గురించి ఇబ్బంది పడలేదు. కానీ ఇక్కడ ప్రతిరోజూ భోజనానికి రూ.40, లాడ్జిలో రూమ్‌కి రూ.250 కావాలి. రోజుకి రూ.300 సంపాదించేందుకు ఒక్కోచోట ఒక్కో రకమైన కష్టాల్ని రుచిచూశాను’ అని చెప్పాడు సూరత్‌కు తిరిగొచ్చిన ద్రవ్య.
‘నా కుమారుడికి ఓ పరీక్ష పెట్టాను. మూడు నిబంధనలు కూడా విధించాను. ఆ సవాలును అతను స్వీకరించాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. ఇవి సొంతంగా తెలుసుకోవాలే తప్ప, ఏ యూనివర్శిటీలోనూ ఇలాంటివి బోధించరు’ అని వ్యాఖ్యానించిన శాజీ ఆధునిక సమాజంలోని తల్లిదండ్రులకు నిజంగా మార్గదర్శకుడే!