జాతీయ వార్తలు

ఓటింగ్‌కు రాని హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 22: ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. బిజెపి, అకాలీదళ్ సభ్యులు శుక్రవారం చేసిన గొడవ మూలంగా ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు. బిజెపి, అకాలీదళ్ సభ్యులు ఆమ్‌ఆద్మీ పార్టీ సభ్యుడి వీడియోను అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుకుండా చేశారు. రామచందర్‌రావు బిల్లు శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఓటింగ్‌కు రావలసి ఉంది. వీడియోను ఫేస్ బుక్‌లో పెట్టటం ద్వారా పార్లమెంటుకు ముప్పు తెచ్చిన భగవంత్ సింగ్ మాన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి, అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేయటంతో హోదా బిల్లుపై ఓటింగ్ జరపటం అసాధ్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా లభించకుండా చూసేందుకే బిజెపి, అకాలీదళ్ సభ్యులు పోడియం వద్ద గొడవ చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు తివారీ, సిపిఎం ఫక్షం నాయకుడు సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సభ సభ్యుడు కాని ఒక మంత్రి (హర్‌సిమ్రన్ కౌర్) లోక్‌సభ వ్యవహారాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాలి, ఎందుకిలాగొడవ చేయాలని కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి పై మండిపడ్డారు.ప్రతిపక్షానికి చెందిన కొందరు సభ్యుల కొత్త ప్రైవేట్ మెంబర్ల బిల్లులను సభలో ప్రతిపాదించిన అనంతరం మీ వాదన వింటానంటూ డిప్యూటీ చైర్నన్ పి.జె.కురియన్ అధికార పక్షానికి చెందిన సభ్యులకు నచ్చ జెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించ లేదు. అధికార పక్షం సభ్యులు దుర్బుద్ధితోనే ప్రత్యేక హోదా సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగకుండా పోడియం వద్ద గొడవ చేస్తున్నారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకు పడినా ఫలితం కనిపించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యడు భగవంత్‌సింగ్ మాన్ పార్లమెంటు భద్రతా వ్యవస్థపై ఈ రోజు ఉదయం తీసిన పనె్నండు నిమిషాల వీడియో వ్యవహారం ఈరోజు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేసింది. అధికార పక్షమైన బిజెపితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఇతర అన్ని పార్టీలు కూడా భగవంత్ సింగ్ మాన్ చర్యను ఖండించారు. మాన్ పార్లమెంటు భద్రతా వ్యవస్థపై సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియోను ఫేస్ బుక్‌లో పెట్టారు. ఈ వ్యవహారాన్ని బిజెపి, అకాలీదళ్ సభ్యులు ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరగకుండా చూసేందుకు ఉపయోగించుకున్నారు. రాజ్యసభ ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరిగి సమావేశం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ మొదట కొత్త ప్రైవేట్ మెంబర్ల బిల్లును చర్చకు స్వీకరించిన అనంతరం మిగతా కార్యక్రమం చేపడతానని చెప్పారు. బిజెపి, అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి భగవంత్ సింగ్ మాన్‌పై చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.పోడియంను చుట్టుముడి మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది.సభను అదుపులోకి తెచ్చేందుకు కురియన్ తీవ్రంగా కృషి చేశారు. అధికార పక్షానికి చెందిన సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం ఏమిటని వారికి చివాట్లు పెట్టారు. ఈ పరిణామం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ మెంబర్ల బిల్లుల ప్రతిపాదన తర్వాత ఆవకాశం ఇస్తానని చెప్పినా ఫలితం లేకపోయింది.దీనితో ఆగ్రహించిన ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఆరోపణలతో ముంచెత్తింది. ఏపికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేందుకే బి.జె.పి ఇలా చేస్తోందని ఆనంద్ శర్మ, అంబికాసోని, సుబ్బిరామిరెడ్డి, కె.వి.పి.రామచందర్‌రావు, ఎం.ఏ.ఖాన్ తదితరులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కెవిపి బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్దంగా ఉన్నది, సభలో శాంతి నెలకొల్పితే ప్రత్యేక హోదా బిల్లును చేపట్టేందుకు వీలుంటుందని తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్ చెప్పారు.ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్‌కు రాకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారని సిపిఎం నేత ఏచూరి ధ్వజమెత్తారు. అధికార పక్షం సభ్యులు ఇలాగే గొడవ చేస్తే సభను వాయిదా వేయవలసి వస్తుందని కురియన్ పదే,పదే హెచ్చరించారు. సభ్యులు ఎంతకీ శాంతించక పోవడంతో చేసేదేమీ లేక సభను సోమవారానికి వాయిదా వేసి కురియన్ వెళ్లిపోయారు.