జాతీయ వార్తలు

అన్ని పంచాయతీలూ ఓఎఫ్‌సి నెట్‌వర్క్‌లోకి కేంద్రం వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి) కింద అనుసంధానం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018 నాటికి డిజిటల్ ఇండియా చేయాలన్నది ప్రభుత్వం యోచన. దీన్లో భాగంగా అన్ని పంచాయతీలను ఓఎఫ్‌సికి అనుసంధానం చేస్తామని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభకు తెలిపారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ప్రాజెక్టు పేరును భారత్‌నెట్‌గా మార్చినట్టు ఆయన తెలిపారు. ఓఎఫ్‌సి ద్వారా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ఒకే నెట్‌వర్క్ కిందకు తీసుకొస్తామని ఆయన చెప్పారు. అండర్‌గ్రౌండ్ ఫైబర్, ఫైబర్ ఓవర్‌పవర్ లైన్స్, రేడియో, శాటిలైట్ మీడియాలను బ్రాండ్‌బాండ్ కనక్టివిటీ చేస్తారని పేర్కొన్నారు. పంచాయతీలకు అన్ని రంగాలు సేవలు అందడమే కాకుండా ఎలాంటి వివక్షా ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశల్లో ఈ పథకాన్ని పూర్తిచేస్తారన్నారు.
తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలను అండర్‌గ్రౌండ్ ఓఎఫ్‌సి ద్వారా అనుసంధానం చేస్తారని తెలిపారు. ఇది 2017 మార్చినాటికి పూర్తవుతుందన్నారు. రెండో దశలో మిగతా లక్షన్నర గ్రామ పంచాయతీలను ఆప్టిమల్ మిక్స్ అండర్ గ్రౌండ్ ఫైబర్ కింద అనుసంధానం చేస్తారన్నారు. ఇది 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మూడోదశలో జిల్లాలు, బ్లాక్‌లకు ఫైబర్ నెట్‌వర్క్, 5జి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు.