జాతీయ వార్తలు

విమాన చార్జీలకంటే తక్కువ హైస్పీడ్ రైలు ధరపై సురేష్ ప్రభు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ముంబయి- అహ్మదాబాద్ మధ్య తలపెట్టిన హైస్పీ డ్ రైల్ కారిడార్ ఆరేళ్లలో పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైలు చార్జీలు విమాన చార్జీలకంటే తక్కువగానే ఉంటాయని బుధవారం లోక్‌సభకు తెలిపారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని హైస్పీడ్ రైలు రెండు గంటలో చేరుకుంటుందని లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చెప్పారు. రైలు గరిష్ఠవేగం గంటకు 350 కిలోమీటర్లు. హైస్పీడ్ రైలు గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుస్తుందని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఆ దూరాన్ని ఏడుగంటల్లో చేరుకుంటుంది. కాగా రైల్వే పథకాల విషయంలో ఎలాంటి వివక్షాలేదని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు కేటాయిస్తున్నట్టు సురేష్ ప్రభు తెలిపారు.
ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను 97,636 కోట్ల రూపాయల అంచనాతో చేపడుతున్నారు. జపాన్ రుణ సహాయంతో దీన్ని నిర్మించనున్నారు.