జాతీయ వార్తలు

విద్యా సంస్థలనూ జనాభా ప్రాతిపదికపైనే విభజించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: విద్యా సంస్థలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై విభజించాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ బుధవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూలు పరిధిలోని 31 సంస్థలు, కంపెనీలను ఇంకా విభజించవలసి ఉన్నది, విద్యా సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొన్నాయని ఆయన సభకు వివరించారు. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు, వాటి ఆస్తిపాస్తులు తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోందని శ్రీనివాస్ చెప్పారు. 10 షెడ్యూలులోని 75వ సెక్షన్ విద్యా సంస్థలను ఆయా రాష్ట్రాల్లో కొనసాగించాలని మాత్రమే సూచిస్తుంది తప్ప ఆస్తులు, అప్పుల పంపిణీకి ఇది వర్తించదని ఆయన వాదించారు. నేటివిటీ అధారంగా ఈ సంస్థల ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు తాము ఎంతమాత్రం అంగీకరించలేమని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపించేందుకు వీలుకాని సంస్థలను కొనసాగించలేదని ఆయన స్పష్టం చేశారు. 9వ షెడ్యూలు పరిధిలోని ఉద్యోగులను జనాభా ప్రాతిపదికపై విభజించాలి తప్ప నేటివిటీ ఆధారంగా కాదని ఆయన సూచించారు. జనాభా ప్రాతిపదికపై 42:58 నిష్పత్తిలో పంపిణీ చేయాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాలను ఇదివరకే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

హైటెక్ మ్యూజియంకు
వచ్చేవారం మోదీ ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, జూలై 20: రాష్టప్రతి భవన్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేవారం ప్రారంభించనున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని రాష్టప్రతి ప్రెస్ సెక్రెటరీ వేణు రాజమోనీ వెల్లడించారు.

‘పెద్దపేగు వ్యాధిని అరికట్టేందుకు చర్యలు’

న్యూఢిల్లీ, జూలై 20: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వ్యాపిస్తున్న పెద్దపేగు వ్యాధిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ లోకసభలో విజ్ఞప్తి చేశారు. దేశంలో కోటికంటే ఎక్కువమంది పెద్దపేగు సంబంధిత (ఐబిడి) వ్యాధితో బాధపడుతున్నారు, ఖమ్మం జిల్లాలో ఈ వ్యాధి వేగంగా ప్రబలుతోందని అన్నారు. ఈ వ్యాధి సోకినవారు అతిసారతోపాటు తికమక లక్షణాలతో బాధపడుతుంటారన్నారు. ఇలాంటి వ్యాధి ఒకటున్నదనే విషయం ప్రజలకు తెలియకపోవటంతో సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారని వివరించారు.